న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మూడో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చతికిలపడ్డారు. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న పోరులో లంకేయులు 136 పరుగులకే ఆలౌటయ్యారు. కరుణరత్నే(52), కుశాల్ పెరీరా(29) మినహా మిగతావారు రాణించలేదు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ధాటికి లంక బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్ చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
-
GOT EM! Lockie Ferguson knocks over Malinga with a full, fast, straight one! Sri Lanka ALL OUT for 136 - superb effort with the ball from NZ!
— BLACKCAPS (@BLACKCAPS) June 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
LIVE SCORING | https://t.co/v0ZonaJtee #BACKTHEBLACKCAPS #CWC19 #NZvSL pic.twitter.com/0UWkk0LCOQ
">GOT EM! Lockie Ferguson knocks over Malinga with a full, fast, straight one! Sri Lanka ALL OUT for 136 - superb effort with the ball from NZ!
— BLACKCAPS (@BLACKCAPS) June 1, 2019
LIVE SCORING | https://t.co/v0ZonaJtee #BACKTHEBLACKCAPS #CWC19 #NZvSL pic.twitter.com/0UWkk0LCOQGOT EM! Lockie Ferguson knocks over Malinga with a full, fast, straight one! Sri Lanka ALL OUT for 136 - superb effort with the ball from NZ!
— BLACKCAPS (@BLACKCAPS) June 1, 2019
LIVE SCORING | https://t.co/v0ZonaJtee #BACKTHEBLACKCAPS #CWC19 #NZvSL pic.twitter.com/0UWkk0LCOQ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక రెండో బంతికే తిరిమన్నె వికెట్ కోల్పోయింది. అనంతరం కరుణరత్నే, కుశాల్ పెరీరా నిలకడగా ఆడారు. వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుశాల్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు మ్యాట్ హెన్రీ. అక్కడ నుంచి బ్యాట్స్‌మెన్ వరుసగా విఫలమయ్యారు.
కరుణరత్నే ఒక్కడే..
46 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ఠ స్థితిలో ఉన్న శ్రీలంక.. 14 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ కరుణరత్నే, తిసారా పెరీరా(27) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా కరుణరత్నే క్రీజులో పాతుకుపోయాడు. 84 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
-
3️⃣ - Matt Henry
— ICC (@ICC) June 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
2️⃣ - Lockie Ferguson
1️⃣ - Colin de Grandhomme
0️⃣ - Trent Boult
New Zealand are dominant at Cardiff, with Sri Lanka 68/6 after 16 overs, and their attack leader hasn't even taken a wicket yet!#NZvSL LIVE 👇 https://t.co/ioG8yDOSD7 pic.twitter.com/naL9CBb1yi
">3️⃣ - Matt Henry
— ICC (@ICC) June 1, 2019
2️⃣ - Lockie Ferguson
1️⃣ - Colin de Grandhomme
0️⃣ - Trent Boult
New Zealand are dominant at Cardiff, with Sri Lanka 68/6 after 16 overs, and their attack leader hasn't even taken a wicket yet!#NZvSL LIVE 👇 https://t.co/ioG8yDOSD7 pic.twitter.com/naL9CBb1yi3️⃣ - Matt Henry
— ICC (@ICC) June 1, 2019
2️⃣ - Lockie Ferguson
1️⃣ - Colin de Grandhomme
0️⃣ - Trent Boult
New Zealand are dominant at Cardiff, with Sri Lanka 68/6 after 16 overs, and their attack leader hasn't even taken a wicket yet!#NZvSL LIVE 👇 https://t.co/ioG8yDOSD7 pic.twitter.com/naL9CBb1yi
కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. తిరిమన్నె, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్‌ను(0) ఔట్ చేయగా... ధనుంజయ డిసిల్వా(4), జీవన్ మెండిస్(1)లను పెవిలియన్ చేర్చాడు ఫెర్గ్యూసన్. ధాటిగా ఆడుతున్న తిసారా పెరీరాను వెనక్కి పంపాడు జేమ్స్ నీషమ్. ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్, సాంట్నర్, జేమ్స్ నిషమ్ తలో వికెట్ తీశారు.