ETV Bharat / sports

WC 19: ప్రపంచకప్​ యుద్ధం.. చూసేందుకు అందరూ సిద్ధం

ఐదు సార్లు విశ్వ విజేతగా నిలిచి మరోసారి ఛాంపియన్​ కావాలని కలలు కంటోంది ఆసీస్​. రెండు సార్లు టైటిల్ నెగ్గిన టీమిండియా మూడోసారి ట్రోఫీ గెలిచి బ్రిటీష్ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించాలనుకుంటోంది. క్రికెట్​ జన్మస్థానమైన ఇంగ్లాండ్ ఈ సారైనా మెగాటోర్నీని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 12వ వరల్డ్​కప్​ టోర్నీ నేటి నుంచే ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానుంది.

author img

By

Published : May 30, 2019, 5:30 AM IST

ప్రపంచకప్

ఐపీఎల్ సందడి అయిపోయింది... ఎన్నికల సమరం ముగిసింది.. విద్యార్థుల పరీక్షల పోరు సమాప్తమైంది.. ఇక మిగిలిందల్లా ప్రపంచ దేశాల మధ్య జరిగే క్రికెట్ యుద్ధమే. ఈ పోరులో గెలిచేది ఎవరు? సవాళ్లను దాటి విశ్వ విజేతగా నిలిచేది ఎవరు? వరల్డ్​కప్​ కోసం స్మిత్ అంకితభావాన్ని, విజేత కావాలనే మోర్గాన్ లక్ష్యాన్ని భారత సారథి కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడు? వీటన్నింటికి సమాధానం నేటి నుంచే తెలియనుంది. ప్రపంచకప్​లో తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది.

WORLDCUP
ఇంగ్లాండ్ సారథి మోర్గాన్​ - దక్షిణాఫ్రికా కెప్టెన్​ డుప్లెసిస్​

రౌండ్ రాబిన్ విధానంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్​లో పది దేశాలు బరిలో దిగుతున్నాయి. సెమీస్​కు చేరాలంటే ప్రతీ జట్టు కనీసం 5 మ్యాచ్​లు గెలవాలి. ఈ అంశంపై దృష్టి పెట్టాయి అన్ని జట్లు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, విండీస్ జట్లు ప్రపంచకప్​లో ప్రధాన జట్లుగా బరిలో దిగుతున్నాయి.

WORLDCUP
వరల్డ్​కప్​లో టీమిండియా మ్యాచ్​ల షెడ్యూల్​

కెప్టెన్​గా కోహ్లీ కల నెరవేరేనా...

అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది భారత జట్టు. బౌలింగ్​లో బుమ్రా, కుల్దీప్, చాహల్​లు కీలకం కానున్నారు. సారథి విరాట్​ కోహ్లీతో పాటు ధావన్, రోహిత్, ధోని, హార్దిక్ పాండ్యలతో టీమిండియా బ్యాటింగ్​ దుర్భేద్యంగా ఉంది. మిడిల్ ఆర్డర్​లో కొన్ని సమస్యలున్నప్పటికీ జట్టు బలంగా ఉంది. సెమీస్​ వెళ్లేందుకు ఎక్కువ అవకాశమున్న జట్లలో భారత్​ ముందు వరుసలో ఉంది. ఇంతకు ముందు ప్రపంచకప్​ ఆడిన ఏ భారత జట్టు ఇప్పుడున్నంత బలంగా లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

WORLDCUP
భారత్​

వార్నర్ - స్మిత్ రాణించేనా..

డేవిడ్ వార్నర్, స్టీవ్​ స్మిత్​ రాకతో ఆస్ట్రేలియాకు బలం చేకూరింది. ఐపీఎల్​లో వార్నర్ 692 పరుగులు చేసి ప్రపంచకప్​ ముందే ప్రత్యర్థులకు తన ఫామ్​పై సంకేతాలిచ్చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్​లో శతకం చేసి స్టీవ్ స్మిత్​ కూడా జోరుమీదున్నాడు. వీరితో పాటు ఉస్మాన్ ఖవాజా, ఆరోన్ ఫించ్, కమిన్స్​ సత్తా చాటగలిగే బ్యాట్స్​మెన్​. బౌలర్లు మిచెల్ స్టార్క్​, స్పిన్నర్ నాథన్ లయన్​, ఆడం జంపాలతో ఆసీస్​ జట్టు సమతూకంగా ఉంది.

WORLDCUP
ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్​ ప్రపంచకప్​ కల నెరవేరేనా..

44ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారి కూడా వరల్డ్​కప్​ను ముద్దాడలేకపోయింది ఇంగ్లాండ్​. ఇప్పటికి 4 సార్లు స్వదేశంలో ఈ మెగాటోర్నీ జరిగినా.. నిరాశే ఎదురైంది. మోర్గాన్ సారథ్యంలో సొంతగడ్డపై ఐదోసారి జరుగుతున్న ఈ టోర్నీలో గెలిచి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలనుకుంటోంది ఇంగ్లాండ్​. బట్లర్, బెయిర్​ స్టో, మోర్గాన్, రూట్​ లాంటి విధ్వంసకర బ్యాట్స్​మెన్​ ఆ జట్టులో ఉన్నారు. బెన్ స్టోక్స్, మొయిన్​ అలీ లాంటి ఆల్​రౌండర్లతో పాటు జోఫ్రా ఆర్చర్, మార్క్​ ఉడ్​ లాంటి బౌలర్లతో పటిష్ఠంగా ఉంది ఇంగ్లీష్​ జట్టు.

WORLDCUP
ఇంగ్లాండ్

పాక్​ పరాక్రమం చూపించేనా..

అంచనాలకు అందకుండా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచే జట్టు పాకిస్థాన్. రేసులో లేదనుకునేలోపే అద్భుతం చేసేస్తుంది. ఫకర్ జమాన్​, ఇమామ్ ఉల్ హఖ్, మహమ్మద్ హఫీజ్​, బాబర్ అజామ్, హారీస్ సోహైల్ లాంటి ప్రతిభావంతులకు ఆ జట్టులో కొదవలేదు. తనదైన రోజున విజృభించే పాకిస్థాన్​ను తక్కువ అంచనా వేయలేం.

కివీస్ కప్పు గెలిచేనా..

వార్మప్ మ్యాచ్​లో భారత్​కు షాకిచ్చిన న్యూజిలాండ్ ప్రపంచకప్​లో ఫేవరెట్​గా బరిలో దిగుతోంది. కేన్ విలియమ్స్​, మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో లాంటి ఆటగాళ్లతో కివీస్​ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది . ట్రెంట్ బౌల్ట్​, గ్రాండ్​హోమ్​, జిమ్మి నీషమ్​ లాంటి బౌలర్లతో 2015 సీజన్​ కంటే మంచి ప్రదర్శన చేయాలని భావిస్తోంది న్యూజిలాండ్​. బౌలర్లు... బ్యాటింగ్​లోనూ రాణిస్తుండడం కివీస్​కు కలిసొచ్చే అంశం.

WORLDCUP
న్యూజిలాండ్

దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసొచ్చేనా..

బ్యాటింగ్, బౌలింగ్​లో ఎప్పుడు చూసినా బలంగా కనిపించే దక్షిణాప్రికా జట్టు... ప్రపంచకప్​ కల మాత్రం ఇప్పటివరకు తీర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డుప్లెసిస్ సారథ్యంలో బరిలో దిగుతున్న ప్రొటీస్​ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. డికాక్, ఆమ్లా, డేవిడ్ మిల్లర్​ లాంటి బ్యాట్స్​మెన్​ ఉండగా... కగిసో రబాడా, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, ఎంగిడిలతో బౌలింగ్​ విభాగం బలంగా ఉంది.

విండీస్ విజృంభించేనా..

విధ్వంసకర ఆటగాళ్లతో బలంగా ఉంది వెస్టిండీస్ జట్టు. క్రిస్ గేల్, షాయ్ హోప్​, ఆండ్రీ రసెల్​లు ఎప్పుడైనా మ్యాచ్​ను మలుపు తిప్పగలరు. ఐపీఎల్​లో సత్తాచాటిన గేల్, రసెల్... మెగాటోర్నీలో విజృంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. మొదటి రెండు ప్రపంచకప్​ టోర్నీలు గెలిచిన విండీస్​కు... ఆ​ తర్వాత టైటిల్ అందని ద్రాక్షలాగే మారింది.

WORLDCUP
ప్రపంచకప్​ ప్రైజ్ మనీ

పసికూనలు పట్టు సాధించేనా..

చిన్నజట్టుగా బరిలో దిగుతున్న అఫ్గానిస్థాన్ ఇప్పటికే వార్మప్​ మ్యాచ్​లో పాకిస్థాన్​ను ఓడించి ప్రపంచకప్​లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. రషీద్ ఖాన్, నబీ, మహమ్మద్ షెహజాద్​ లాంటి వరల్డ్​క్లాస్ ప్లేయర్లు ఈ జట్టు సొంతం. జట్ల బలాబలాల పరంగా బంగ్లాదేశ్​, శ్రీలంక కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ తక్కువ అంచనా వేయలేం. బంగ్లాలో షకీబ్, మొర్తజా, తమీమ్ ఇక్బాల్​, ముష్ఫీకర్ రహీమ్ కీలక ఆటగాళ్లు. శ్రీలంకలో మలింగ, కరుణరత్నే అనుభవజ్ఞులైన క్రీడాకారులు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న 12వ వరల్ట్​కప్​ టోర్నీ ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా నేడు ప్రారంభం కానుంది. జులై 14న లార్డ్స్ వేదికగా ఫైనల్​ జరగనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఆసీస్ 5 సార్లు ప్రపంచకప్​ను సొంతం చేసుకోగా.. భారత్​, విండీస్ చెరో రెండుసార్లు కైవసం చేసుకున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్​ చెరో సారి ప్రపంచకప్​ను ముద్దాడాయి. మరి 12వ వరల్డ్​కప్​ విజేత ఎవరో తెలుసుకోవాలంటే జులై 14 వరకు వేచి చూడాల్సిందే.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.