ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరగుతోన్న మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. హెడింగ్లే వేదికగా జరుగుతోన్న ఈ పోరులో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కరీబియన్ బ్యాట్స్‌మెన్ హోప్(77), ఎవిన్ లూయిస్(58), నికోలస్ పూరన్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అప్గాన్ బౌలర్లలో దౌలత్ జడ్రాన్ రెండు వికెట్లు తీయగా.. నబీ, రషీద్, షిర్జాద్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తన కెరీర్లో చివరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతోన్న గేల్ నిరాశపర్చాడు. జట్టు స్కోరు 21 పరుగులున్నప్పుడే గేల్ పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన లుయీస్ - షై హోప్ జోడి నిలకడగా ఆడింది. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఈ ద్వయాన్ని రషీద్ ఖాన్ విడదీశాడు. లూయిస్‌ను ఔట్ చేసి విండీస్‌ను కట్టడి చేశాడు.
-
🇦🇫 v🌴
— Windies Cricket (@windiescricket) July 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Good batting performance to get us over the 300+ run mark.
WI 311/6 (50.0 ov)
Hope 77 (92)
Pooran 58 (43)#AFGvWI #MenInMaroon #CWC19 pic.twitter.com/ClMGzaYbGs
">🇦🇫 v🌴
— Windies Cricket (@windiescricket) July 4, 2019
Good batting performance to get us over the 300+ run mark.
WI 311/6 (50.0 ov)
Hope 77 (92)
Pooran 58 (43)#AFGvWI #MenInMaroon #CWC19 pic.twitter.com/ClMGzaYbGs🇦🇫 v🌴
— Windies Cricket (@windiescricket) July 4, 2019
Good batting performance to get us over the 300+ run mark.
WI 311/6 (50.0 ov)
Hope 77 (92)
Pooran 58 (43)#AFGvWI #MenInMaroon #CWC19 pic.twitter.com/ClMGzaYbGs
అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్మియర్ సాయంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు హోప్. వీరిద్దరూ 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో జడ్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు హెట్మియర్. కాసేపటికే హోప్ నబీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
చివర్లో నికోలస్ పూరన్ - జాసన్ హోల్డర్ జోడి దూకుడుగా ఆడింది. వికెట్లు నిలబెట్టుకుంటూనే వేగంగా పరుగులు రాబట్టింది. ఐదో వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుస బంతుల్లో ఇద్దరూ ఔటయ్యారు నికోలస్ (58) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, హోల్డర్ 45 పరుగులతో రాణించాడు.
అఫ్గాన్ బౌలర్లలో దౌలత్ జాడ్రాన్ 2 వికెట్లు తీయగా.. రషీద్, నబీ, షిర్జాద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇవీ చూడండి.. 'రోహిత్ లాంటి బ్యాట్స్‌మనే అక్కడ ఆడగలడు'