ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల సంచలన ఇన్నింగ్స్ ఆడిన పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్.. వన్డే ర్యాంకింగ్స్లో దూకుడు చూపించాడు. ఏడు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో 193 పరుగులు చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు.
బంగ్లాదేశ్తోపై ఇటీవల టీ20తో అరంగేట్రం చేసిన కివీస్ క్రికెటర్ ఫిన్ అలెన్.. టాప్-100లో చోటు దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్లో 29 బంతుల్లో 71 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు.
వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కోహ్లీ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20లో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ ఉన్నాడు. బౌలర్లలో వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్), టీ20ల్లో షంషీ(దక్షిణాఫ్రికా).. టాప్లో ఉన్నారు.
ఇది చదవండి: ధోనీ, కోహ్లీలను అధిగమించి ఫకర్ ప్రపంచ రికార్డు