క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినా.. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ శైలి మాత్రం మారలేదు. క్రికెట్ లెజెండ్స్ ఆడుతోన్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఈ విషయం మరోమారు రుజువైంది. శనివారం దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్ 18వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో అలరించాడు యువీ. 22 బంతుల్లో 52 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగుల పెట్టించాడు.
-
Yuvraj is back 6,6,6,6 in a over#YuvrajSingh #RoadSafetyWorldSeries2021 pic.twitter.com/RDmkGte3s8
— Trollmama_ (@Trollmama3) March 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yuvraj is back 6,6,6,6 in a over#YuvrajSingh #RoadSafetyWorldSeries2021 pic.twitter.com/RDmkGte3s8
— Trollmama_ (@Trollmama3) March 13, 2021Yuvraj is back 6,6,6,6 in a over#YuvrajSingh #RoadSafetyWorldSeries2021 pic.twitter.com/RDmkGte3s8
— Trollmama_ (@Trollmama3) March 13, 2021
యువరాజ్ సిక్సర్లు.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. యువీ ఆటలో ఏమాత్రం మార్పులేదని నెటిజెన్లు ట్వీట్లు చేస్తున్నారు. నాటి యువరాజ్‌ను చూస్తున్నట్టు ఉందని అంటున్నారు.
ఈ మ్యాచ్‌లో యువరాజ్‌తో పాటు క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ కూడా అద్భుతంగా రాణించాడు. 37 బంతుల్లో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో 20 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ 204 పరుగులు చేయగలిగింది.