ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు పడగొట్టిన ఏకైక పేసర్‌గా ఇటీవల రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో భాగంగా ఐదురోజున ఈ ఘనత సాధించాడు. దీంతో పలువురు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా.. అండర్సన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
"చారిత్రక మైలురాయిని అందుకున్నందుకు శుభాకాంక్షలు జిమ్మీ. నీ తెగువ, పట్టుదలే ఈ అసాధ్యమైన ఘనతను సాధించేలా చేశాయి. నువ్వు మరిన్ని రికార్డులు సృష్టించాలి" అంటూ ట్వీట్ చేశాడు.
-
Congratulations for your remarkable achievement @jimmy9! Your passion, fortitude and drive are exceptional, cheers and best wishes for the future. #600TestWickets
— Jasprit Bumrah (@Jaspritbumrah93) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations for your remarkable achievement @jimmy9! Your passion, fortitude and drive are exceptional, cheers and best wishes for the future. #600TestWickets
— Jasprit Bumrah (@Jaspritbumrah93) August 25, 2020Congratulations for your remarkable achievement @jimmy9! Your passion, fortitude and drive are exceptional, cheers and best wishes for the future. #600TestWickets
— Jasprit Bumrah (@Jaspritbumrah93) August 25, 2020
అయితే బుమ్రా ట్వీట్‌పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఈ వైవిధ్య బౌలర్‌కి ఓ ఛాలెంజ్ విసిరాడు. "నువ్వు కనీసం 400 వికెట్లయినా తీయాలి" అంటూ బుమ్రాకు సూచించాడు. అండర్సన్‌ను కూడా యువీ మెచ్చుకున్నాడు.
"ఓ ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో 600 వికెట్లు సాధిస్తాడని నా జీవితంలో అనుకోలేదు. ఎంతో నాణ్యతతో కూడిన బౌలింగ్ చేస్తేగానీ ఇలాంటి ఘనత సాధ్యం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే ఉత్తమ బౌలర్ జిమ్మీ" అంటూ కొనియాడాడు.
బుమ్రా ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 20.3 సగటుతో 68 వికెట్లు తీశాడు. 64 వన్డేల్లో 24.4 సగటుతో 104 వికెట్లు సాధించాడు. 50 టీ20ల్లో ఆడిన బుమ్రా 59 వికెట్లు పడగొట్టాడు.
ఎక్కువమంది భారత్ బ్యాట్స్‌మెన్‌నే
600 వికెట్లలో భారత బ్యాట్స్‌మెన్‌నే ఎక్కువసార్లు ఔట్ చేశాడు అండర్సన్. ఇందులో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌వి 110 వికెట్లు ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియాపై 104 వికెట్లు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాపై 83, వెస్టిండీస్‌పై 87 వికెట్లు సాధించాడు.
అలాగే సొంతగడ్డపై 384 వికెట్లను తీశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 50కి పైగా వికెట్లు పడగొట్టాడు.
నాల్గవ స్థానంలో
మొత్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు అండర్సన్. స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చూడండి కోహ్లీ ఎదుర్కొన్న ఉత్తమ బౌలర్లలో అండర్సన్‌కు చోటు