దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా వాయిదా వేయడం పలు విమర్శలకు దారీ తీసింది. దీనిపై పలువురు మాజీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ కూడా ఇదే విషయమై మాట్లాడుతూ.. అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా చేయడం ఆటకు మంచిది కాదని సూచించాడు. ఒకవేళ ఇదే సమయంలో భారత్ పర్యటనకు వెళ్లాల్సి వస్తే ఆసీస్ ఇదే విధంగా చేసి ఉండేదా? అని ప్రశ్నించాడు.
-
The Aussies pulling out of the tour of SA is a huge worry for the game ... Would they have pulled out of a tour to India is the question ?? !! It’s so important in these times that the big 3 do everything they can to help out those without the financial clout ... #JustSaying
— Michael Vaughan (@MichaelVaughan) February 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Aussies pulling out of the tour of SA is a huge worry for the game ... Would they have pulled out of a tour to India is the question ?? !! It’s so important in these times that the big 3 do everything they can to help out those without the financial clout ... #JustSaying
— Michael Vaughan (@MichaelVaughan) February 3, 2021The Aussies pulling out of the tour of SA is a huge worry for the game ... Would they have pulled out of a tour to India is the question ?? !! It’s so important in these times that the big 3 do everything they can to help out those without the financial clout ... #JustSaying
— Michael Vaughan (@MichaelVaughan) February 3, 2021
"దక్షిణాఫ్రికా పర్యటనను ఆసీస్ వాయిదా వేయడం ఆటకు మంచిది కాదని నా అభిప్రాయం. భారత్ విషయంలో కూడా ఆసీస్ ఇలానే చేస్తుందా?. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న జట్లను పెద్ద జట్లు సాధ్యమైనంత వరకు ఆదుకోవడం చాలా ముఖ్యం."
-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ సారథి
అదే కారణమా...
దక్షిణాఫ్రికా పర్యటన వాయిదా విషయంలో కరోనా కన్నా కూడా ఇతర విషయాలు కారణమని వినిపిస్తోంది. భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. పైగా ఆటగాళ్లకు, కోచ్ లాంగర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుత స్థితిలో దక్షిణాఫ్రికా ఆటగాడు రబాడ, నోర్జే, ఎంగిడి లాంటి బౌలర్లను ఎదుర్కొని అక్కడ గెలవడం సులువు కాదున్న వాదనలు వస్తున్నాయి.
ఇదీ చూడండి: భారత్ ఆత్మీయ దేశం: పీటర్సన్