ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన భారత జట్టును నేడు ప్రకటించింది బీసీసీఐ. మరి విభాగాల వారిగా మన బలమెంతో ఇప్పుడు చూద్దాం!
-
Seven from India's 2015 World Cup campaign make it to their 2019 squad https://t.co/GN5GBjcPHu #CWC19 #WorldCup2019 pic.twitter.com/PB2FFW8CSw
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Seven from India's 2015 World Cup campaign make it to their 2019 squad https://t.co/GN5GBjcPHu #CWC19 #WorldCup2019 pic.twitter.com/PB2FFW8CSw
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019Seven from India's 2015 World Cup campaign make it to their 2019 squad https://t.co/GN5GBjcPHu #CWC19 #WorldCup2019 pic.twitter.com/PB2FFW8CSw
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019
ముగ్గురు ఓపెనర్లు...
ప్రపంచకప్‌లో భారత జట్టు ముగ్గురు ఓపెనర్లతో బరిలో దిగుతుంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ రెగ్యులర్ ఓపెనర్లుగా తుది జట్టులో స్థానం దాదాపు పదిలమే. కేఎల్ రాహుల్ రిజర్వ్ ఓపెనర్‌గా ఉన్నాడు.
-
On KL Rahul's role:
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
'To begin with, he will only be a reserve opener, but if the team management needs, he can bat in the middle order too'
Live blog: https://t.co/GN5GBjcPHu #CWC19 #WorldCup2019 pic.twitter.com/eu79khTGDz
">On KL Rahul's role:
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019
'To begin with, he will only be a reserve opener, but if the team management needs, he can bat in the middle order too'
Live blog: https://t.co/GN5GBjcPHu #CWC19 #WorldCup2019 pic.twitter.com/eu79khTGDzOn KL Rahul's role:
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019
'To begin with, he will only be a reserve opener, but if the team management needs, he can bat in the middle order too'
Live blog: https://t.co/GN5GBjcPHu #CWC19 #WorldCup2019 pic.twitter.com/eu79khTGDz
ఇప్పటికే విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్, ధావన్‌లకు వన్డేల్లో మంచి రికార్డుంది. 101 ఇన్నింగ్స్‌ల్లో 4541 పరుగులు జోడించారు. సగటు 45 కావడం విశేషం. ఇందులో 15 శతక భాగస్వామ్యాలున్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్ ఓపెనర్‌గానే కాకుండా మిడిల్ ఆర్డర్లోనూ ఉపయోగపడతాడు.
మిడిలార్డర్...
మిడిలార్డర్లో భారత జట్టుకు వెన్నెముక సారథి విరాట్ కోహ్లీ. ఛేజింగ్‌లో కింగ్ మూడో స్థానంలో అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నాడు. టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్‌వన్ క్రికెటర్‌గా ఉన్న కోహ్లీపైనే భారత క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ప్రపంచకప్‌కు ముందు నాలుగో స్థానం కోసం... ఎన్నో మార్పులు చేసింది సెలక్షన్ కమిటీ. ఎంతో మందిని ప్రయత్నించి చివరకు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసింది. అయితే.. భారత మాజీ సారథి, అనుభవజ్ఞుడు, వికెట్‌కీపర్ ధోని నాలుగో స్థానంలో వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే.. 5, 6 స్థానాల్లో కార్తీక్, కేదార్ జాదవ్, ఆల్‌రౌండర్ విజయ్శంకర్ల మధ్య పోటీ పెరుగుతుంది.
ఆల్‌రౌండర్లతో అదరహో...
-
'Wicketkeeping also matters. That is the reason why we went with Dinesh Karthik otherwise Rishabh Pant was also there'
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
India's chief selector MSK Prasad states Karthik will only make the XI in the absence of MS Dhoni
Live blog: https://t.co/GN5GBjcPHu #CWC19 pic.twitter.com/fcf7UsHjEN
">'Wicketkeeping also matters. That is the reason why we went with Dinesh Karthik otherwise Rishabh Pant was also there'
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019
India's chief selector MSK Prasad states Karthik will only make the XI in the absence of MS Dhoni
Live blog: https://t.co/GN5GBjcPHu #CWC19 pic.twitter.com/fcf7UsHjEN'Wicketkeeping also matters. That is the reason why we went with Dinesh Karthik otherwise Rishabh Pant was also there'
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019
India's chief selector MSK Prasad states Karthik will only make the XI in the absence of MS Dhoni
Live blog: https://t.co/GN5GBjcPHu #CWC19 pic.twitter.com/fcf7UsHjEN
ప్రధానంగా మిడిల్ ఆర్డర్‌పై దృష్టిపెట్టిన సెలెక్షన్ కమిటీ... జట్టులో ఆల్రౌండర్లను ఎక్కువ మందిని తీసుకుంది. ప్రధాన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. జట్టు స్థితిని ఒక్కసారిగా మార్చేయగల సత్తా ఈ దూకుడైన ఆటగాడి సొంతం. విజయ్‌శంకర్, రవీంద్ర జడేజాలు ఇటీవలి చక్కటి ప్రదర్శనలు చేస్తున్నారు. కేదార్ జాదవ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. మరో ఆల్‌రౌండర్‌గా ఇతనికి తుది జట్టులో చోటు దక్కొచ్చు.
ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు..ముగ్గురు పేసర్లు...
ఐదారేళ్ల కింద భారత జట్టులో ప్రధాన స్పిన్నర్లు... అశ్విన్, జడేజా. అయితే... ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తూ వారికి ప్రత్యమ్నాయంగా ఎదిగారు చాహల్, కుల్దీప్ యాదవ్‌లు. వీరిద్దరూ మెగాటోర్నీకి ఎంపికయ్యారు.
గత ఏడాది కాలంగా విదేశాల్లోనూ వీరు మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో జట్టు విజయాల్లో వీరి పాత్ర కీలకం. వీరితో పాటు అనుభవజ్ఞుడైన జడేజా కూడా జట్టులో ఉన్నాడు. కేదార్ జాదవ్ పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఈ నలుగురితో భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉంది.
జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీలతో భారత పేస్ విభాగం బలంగా ఉంది. గత కొంత కాలంగా బుమ్రా , భువీ నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలందిస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ఫాస్ట్ పిచ్‌లపై పేసర్లే కీలకం. అయితే.. ముగ్గురు సీమర్లే ఉండటం భారత్‌కు కొంత బలహీనత. వీరిలో ఎవరైనా గాయాల బారినపడితే జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశముంది.
ఇలా పక్కా వ్యూహంతో ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఇంగ్లండ్ అండ్ వేల్స్ సంయుక్తంగా నిర్వహించే 2019 ప్రపంచకప్ మే 30న ఆరంభం కానుంది. జులై 14న ఫైనల్.
మే 30న ఇంగ్లండ్, సౌతాఫ్రికాల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచ క్రికెట్ సంగ్రామానికి తెరలేవనుంది. జూన్ 5న దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో టీమిండియా.. ప్రపంచకప్‌లో తొలి పరీక్ష ఎదుర్కోనుంది.