వెస్టిండీస్-భారత్ తొలి టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఈ సిరీస్‌తో ప్రారంభిస్తున్నాయి ఇరుజట్లు. విండీస్‌పై 2002 నుంచి ఒక్క టెస్టు సిరీస్ ఓడిపోని భారత్.. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచి 17 ఏళ్లు నుంచి ఉన్న రికార్డును కొనసాగించాలని చూస్తోంది.
ధోనీ రికార్డుకు చేరువలో...
ఈ సిరీస్‌లో టీమిండియా గెలిస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధిస్తాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో విజయం సాధించింది కోహ్లీసేన. ఇప్పుడు ఇది గెలిస్తే కరీబియన్లపై వరుసగా రెండు సిరీస్‌లు గెలిపించిన సారథిగా రికార్డు సొంతం చేసుకుంటాడు విరాట్.
ఇప్పటి వరకూ టెస్టుల్లో 60 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహీ... 27 విజయాలు సాధించాడు. అయితే కెప్టెన్‌గా 46 మ్యాచుల్లో 26 గెలిచి ధోనీకి చేరువలో ఉన్నాడు కోహ్లీ. అదే విధంగా కొత్త టెస్టు జెర్సీల్లో దర్శనమివ్వనున్నారు టీమిండియా ఆటగాళ్లు.
1948 నుంచి మెదలైన విండీస్-ఇండియా టెస్టు సిరీస్‌ల్లో వెస్టిండీస్ ఎక్కువసార్లు గెలిచింది. 23 సిరీస్‌లు జరగ్గా విండీస్ 12, భారత్ 9 సిరీస్‌లు కైవసం చేసుకున్నాయి.
టెస్టు సిరీస్‌లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తోంది వెస్టిండీస్. హోప్, క్యాంప్‌బెల్, హెట్మయిర్ తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. అనుభవజ్ఞుడు డారెన్ బ్రావో, కెప్టెన్ హోల్డర్ భారత్‌ను నిలువరించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్ తరఫున కార్న్‌వాల్ అరంగేట్రం చేసే అవకాశముంది.
జట్లు(అంచనా)
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, రిషభ్ పంత్, చెతేశ్వర్ పుజారా, రాహుల్, ఇషాంత్ శర్మ
వెస్టిండీస్: జేసన్ హోల్డర్(కెప్టెన్), బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, హోప్, క్యాంప్‌బెల్, ఛేజ్, కార్న్‌వాల్, డౌరిచ్, గాబ్రియోల్, హెట్మయిర్, రోచ్
ఇది చదవండి: కొత్త టెస్టు జెర్సీల్లో టీమిండియా క్రికెటర్లు