వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన.. ఐసీసీ గురువారం ప్రకటించిన తాజా జాబితాలోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈమె ఖాతాలో ప్రస్తుతం 802 పాయింట్లు ఉన్నాయి. 36 పాయింట్ల అంతరంతో రెండో స్థానంలో ఉంది ఎల్లీస్ పెర్రీ(ఆస్ట్రేలియా). అదే దేశానికి చెందిన శాటర్త్‌వైట్(759)ను మూడో ర్యాంక్‌కు నెట్టి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుందీ క్రికెటర్.
తగ్గిన మిథాలీ...
ఆస్ట్రేలియాకు చెందిన హేలీ (734 పాయింట్లు) మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగులో నిలిచింది. ఇంగ్లాండ్ క్రికెటర్ బ్యూమాంట్ (722) ఒక్క స్థానం కోల్పోయి ఐదుకు చేరుకుంది. ఇటీవల టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా సారథి మిథాలీరాజ్.. ఒక స్థానం దిగి ఆరులో ఉంది.
టాప్-10లో భారత్ నుంచి ఇద్దరే ఉండగా... ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆరుగురు ఉండటం విశేషం.
-
Ellyse Perry, Alyssa Healy and Stafanie Taylor have moved ⬆️ in the latest @MRFWorldwide ICC Women's ODI Batting Rankings after their exploits in the #WIvAUS ODI series. pic.twitter.com/xAUKXlMlJJ
— ICC (@ICC) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ellyse Perry, Alyssa Healy and Stafanie Taylor have moved ⬆️ in the latest @MRFWorldwide ICC Women's ODI Batting Rankings after their exploits in the #WIvAUS ODI series. pic.twitter.com/xAUKXlMlJJ
— ICC (@ICC) September 12, 2019Ellyse Perry, Alyssa Healy and Stafanie Taylor have moved ⬆️ in the latest @MRFWorldwide ICC Women's ODI Batting Rankings after their exploits in the #WIvAUS ODI series. pic.twitter.com/xAUKXlMlJJ
— ICC (@ICC) September 12, 2019
ఇదీ చదవండి...