ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఇంతకు ముందు ప్రకటించాడు. కానీ రిటైర్మెంట్పై మనసు మార్చుకున్నాడు ఈ విధ్వంసకర ఓపెనర్. టీమిండియాతో స్వదేశంలో జరిగే సిరీస్ తనకు చివరిదని బుధవారం వెల్లడించాడు. ఈ విషయం తెలిసి వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆనందం వ్యక్తం చేశాడు.
"అవును, ఈ విషయం ఫిలిప్ (మీడియా మేనేజర్) నాకు చెప్పాడు. గేల్ దీని గురించి డ్రెస్సింగ్ రూంలో నాతో ఏం చర్చించలేదు. క్రిస్ మైదానంలో ఉండటం నాకెంతో ఆనందం. ఇంకా ఆడేందుకు అతడికి అవకాశముంది. వెస్టిండీస్ జట్టుకు చాలా ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించే అదృష్టం గేల్‌కు దక్కింది. అతడితో ఆడటం మాకు దక్కిన వరం" -జేసన్ హోల్డర్, వెస్టిండీస్ కెప్టెన్
ప్రస్తుత ప్రపంచకప్‌లో 6 మ్యాచ్‌లాడిన విండీస్.. కేవలం ఒకటి మాత్రమే గెలిచి సెమీస్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. గురువారం మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో తలపడనుంది.
ఇది చదవండి: విండీస్‌పై విరాట్ సేన విజృంభించేనా!