ETV Bharat / sports

ధోనీ ఆ సమయానికే ఎందుకు రిటైర్ అయ్యాడు? - ధోనీ ఆ సమయానికి ఎందుకు రిటైర్​

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ.. పంద్రాగస్టున సరిగ్గా 19: 29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలకడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ధోనీకి ఆ నెంబరుకు లింక్​ ఉందా? సహా తదితర ప్రశ్నలు క్రీడాభిమానుల్లో మెదులుతున్నాయి. దీనిపై కొంతమంది ఏమి చెప్పారో తెలుసుకుందాం.

Dhoni
ధోనీ
author img

By

Published : Aug 16, 2020, 4:59 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ ఆగస్టు 15న 19:29గం. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఇన్​స్టా ద్వారా తన క్రీడా ప్రస్థానాన్ని ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్​ చేశాడు. దీంతో క్రికెట్​ అభిమానుల మదిలో ఓ సందేహం మెదులుతోంది. పంద్రాగస్టు రోజునే సరిగ్గా 19:29గం. సమయాన్నే ఎందుకు ఎంచుకున్నాడు. దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అనే దిశగా క్రీడాభిమానులు, విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. కొంతమంది ఈ వియయమై తీవ్రంగా చర్చిస్తూ.. తమకు తెలిసింది నెట్టింట్లో పోస్ట్​ చేశారు. అదేంటో తెలుసుకుందాం.

ధోనీ, రైనా జెర్సీ నెంబర్స్​

ధోనీతో పాటు ఆల్​రౌండర్​ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. వీరిద్దరికి ఆటలో చక్కని భాగస్వామ్యం ఉంది. వీరి జెర్సీలు నెం.7, నెం.3. ఈ రెండు కలిపితే 73.. అయితే సరిగ్గా స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అయింది. ఇందుకే వీరిద్దరు కలిసి పంద్రాగస్టున వీడ్కోలు పలికారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

గతేడాది ప్రపంచకప్​ ఓటమి

ధోనీ చివరిసారిగా 2019లో న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్​లో ఆడాడు. ఈ టోర్నీ సెమీఫైనల్​లో ​ టీమ్​ఇండియా సరిగ్గా 19.29గంటలకు ఓటమిపాలైంది. అందుకే అదే సమయానికి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడని మరికొందరి అభిప్రాయం.

ఏంజెల్​ నెంబర్

1929 అనేది ఏంజెల్​ నెంబర్ అని ఇంకొంతమంది అంటున్నారు. ఈ నెంబర్ ఒక వ్యక్తి తన జీవితంలోని ఓ ప్రధానమైన దశను పూర్తి చేశాడనే అర్థం ఇస్తుందని చెప్తున్నారు.

  • @ap_pune Sir, Dhoni retiring at 19.29 ,🤔 is it indicating 1929 & The Great Depression is coming 😱(as many were expecting in Mar-Apr 2020) !?

    — Expert on Everything Joshi (@SamyukthaJoshi) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కెరీర్​

ధోనీ అంతర్జాతీయ క్రికెట్​లో 2004లో అడుగుపెట్టాడు. వన్డేల్లో 350 మ్యాచులు ఆడి 10వేల 773 పరుగులు చేశాడు. వికెట్​కీపర్​గా 444మంది బ్యాట్స్​మెన్​ను ఔట్​ చేశాడు. అంతర్జాతీయ టీ20లో 98 మ్యాచ్​ల్లో 91మందిని ఔట్​ చేసి రికార్డుకెక్కాడు. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో 17వేల పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు ఉన్నాయి. భారత జట్టుకు టీ20 ప్రపంచ కప్(2007), వన్డే ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) అందించిన సారథిగా ధోనీ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌లో ఈ మూడింటిని ఓ జట్టుకు అందించిన ఏకైక అంతర్జాతీయ సారథి మహీనే.

ఇది చూడండి ధోనీ.. నువ్వో కర్మ యోగి, క్రికెట్​ విరాగి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.