ETV Bharat / sports

ధోనీ.. అదిరింది 'పానీపూరి' టాలెంట్​

టీమ్​ఇండియా మాజీ సారథి​ ధోనీ.. గతంలో తన సహచర ఆటగాళ్లకు పానీపూరి వడ్డిస్తూ కనిపించాడు. ఆ వీడియో మరోసారి మీకోసం.

Dhoni
ధోనీ
author img

By

Published : Aug 30, 2020, 8:05 PM IST

Updated : Aug 30, 2020, 8:19 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ.. కుటుంబంతో, తన సహచర ఆటగాళ్లతో చాలా సరదాగా ఉంటాడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మహీకి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

గతంలో మాల్దీవులకు వెళ్లిన ధోనీ, సహచర క్రికెటర్లకు పానీపూరి అందిస్తూ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోలో మహీ బండి వద్ద నిలబడి పానీపూరి తీసుకుని, కావాల్సిన మోతాదులో బఠాణీ, ఉల్లిపాయ తరుగు పెట్టాడు. చెంచాతో పానీని అందులో పోసి సీనియర్​ స్పిన్నర్‌ పియూష్ చావ్లా, మాజీ పేసర్‌ ఆర్పీసింగ్‌కు అందించాడు. వెంటనే ఆర్పీసింగ్‌ తలను ఆడించి ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. 'బహుముఖ ప్రజ్ఞాశాలి ధోనీ , మహీకి ఎన్నో పనులు వచ్చు', 'ఈ ప్రపంచంలో నాకు పానీపూరీ, మహీ అత్యంత ఇష్టం', అంటూ నెటిజన్లు మహీపై అభిమానాన్ని చాటుతూ ఆ వీడియో దిగువన కామెంట్లు పెట్టారు.

ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్​కింగ్స్.. ఇటీవల క్వారంటైన్​ పూర్తి చేసుకుంది. కానీ కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో 13 మందికి పాజిటివ్ రావడం వల్ల మళ్లీ​ జట్టు మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది.

ఇది చూడండి ఐపీఎల్​ 2020: చెన్నై సూపర్​కింగ్స్ సమస్యలివేనా?

Last Updated : Aug 30, 2020, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.