వెస్టిండీస్ క్రికెటర్లకు ఈ ఏడాది జనవరి నుంచి జీతాలు అందట్లేదు. క్రికెట్ బోర్డులో ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఐర్లాండ్ సిరీస్, ఫిబ్రవరి-మార్చిలోని శ్రీలంక పర్యటనకు సంబంధించిన మ్యాచ్ల ఫీజును పురుష క్రికెటర్లకు ఇంకా చెల్లించలేదు. క్రికెట్ వెస్టిండీస్ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.
"బోర్డు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రతి ఆటగాడి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా వేతనాలు చెల్లిస్తాం. శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్ల సమయంలో మాకు భారీ నష్టమొచ్చింది. ప్రసారకర్తలు రెండు గంటల ప్రసారానికి ఒక మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించారు" -వెయిన్ లూయిస్, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ
అయితే ఆటగాళ్లకు త్వరలో పూర్తి జీతాలు చెల్లిస్తామని క్రికెట్ వెస్టిండీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జానీ గ్రేవ్ తెలిపారు.