'ఐసీసీ టీమ్ ఆఫ్ ది డెకెడ్' అవార్డుల జాబితాను ప్రకటించిన ఐసీసీపై ఫన్నీ ట్వీట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్. దశాబ్దపు ఉత్తమ టీ20 జట్టు ఎంపికపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "కేవలం ముగ్గురు ఫ్రంట్‌లైన్ బౌలర్లా? హే ధోనీ.. ఎవరు ఈ జట్టును ఎంపిక చేసింది?.. కచ్చితంగా ఇది సరైన జట్టు కాదు" అంటూ ధోనీ ఫొటోను జత చేశాడు. ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. ఈ జట్టులో ప్రధాన బౌలర్లుగా రషీద్ ఖాన్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ ఉన్నారు.
-
Only 3 frontline bowlers?!🤔
— Wasim Jaffer (@WasimJaffer14) December 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
"Hey MS, who picked this team?"#ICCAwards2020 #Dhoni https://t.co/D0msUVhQBo pic.twitter.com/gDxfsaPENx
">Only 3 frontline bowlers?!🤔
— Wasim Jaffer (@WasimJaffer14) December 27, 2020
"Hey MS, who picked this team?"#ICCAwards2020 #Dhoni https://t.co/D0msUVhQBo pic.twitter.com/gDxfsaPENxOnly 3 frontline bowlers?!🤔
— Wasim Jaffer (@WasimJaffer14) December 27, 2020
"Hey MS, who picked this team?"#ICCAwards2020 #Dhoni https://t.co/D0msUVhQBo pic.twitter.com/gDxfsaPENx
అలాగే కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ జట్టులోని ఆటగాళ్ల ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "ముగ్గురు బౌలర్లతో జట్టును ముందుకు నడిపించేందుకు ధోనీ నిరాకరిస్తాడు" అని చోప్రా అన్నాడు.
'ఐసీసీ టీమ్ ఆఫ్ ది డెకెడ్' అవార్డుల్లో భారత ఆటగాళ్లదే హవా. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోనీ సారథిగా, టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే, టెస్టు క్రికెట్ జట్లను ఆదివారం ఐసీసీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. టీ20 జట్టులో ధోనీ, కోహ్లీతో పాటు ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. అలాగే వన్డే ఫార్మాట్‌కు వెల్లడించిన జట్టులో ధోనీ, రోహిత్, కోహ్లీ చోటు సంపాదించారు. దశాబ్దపు టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
-
Only three proper bowlers??? Seriously?? 🤷♂️🧐😱 https://t.co/yel0MzNoT3
— Aakash Chopra (@cricketaakash) December 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Only three proper bowlers??? Seriously?? 🤷♂️🧐😱 https://t.co/yel0MzNoT3
— Aakash Chopra (@cricketaakash) December 27, 2020Only three proper bowlers??? Seriously?? 🤷♂️🧐😱 https://t.co/yel0MzNoT3
— Aakash Chopra (@cricketaakash) December 27, 2020
ఇదీ చూడండి : ఐసీసీ దశాబ్దపు ఉత్తమ జట్లకు కెప్టెన్‌గా ధోనీ, కోహ్లీ