చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వివోతో ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ను రద్దు చేసుకుంది బీసీసీఐ. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
"ఐపీఎల్ 2020లో వివోతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది."
-బీసీసీఐ ప్రకటన.
2018 నుంచి ఐదేళ్ల(2022) పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను సొంతం చేసుకుంది వివో. ఇందుకోసం రూ.2190 కోట్లను వెచ్చించింది. అంటే ఏడాదికి రూ.440 కోట్లు.
టైటిల్ స్పాన్సర్ల కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశముంది.
వేసవి కాలంలో జరగాల్సిన ఐపీఎల్ 2020.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19నుంచి ప్రారంభంకానుంది. టోర్నీ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇదీ చూడండి:- ఐపీఎల్లో ఒక్కో జట్టుకు ఒక్కో చోట వసతి