ETV Bharat / sports

'కోహ్లీ భయ్యా! మా ఇల్లూ దగ్గరే.. బిర్యానీ పంపు'

టీమ్​ ఇండియా సారథి కోహ్లీ.. క్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్​కు బిర్యాని పంపినట్లు తన ఇన్​స్టాలో పంచుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన యువ బౌలర్​ చాహల్.. విరాట్​ను కవ్వించేశాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..!

author img

By

Published : Jul 9, 2020, 7:40 AM IST

chahal
చాహల్​

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన హిట్​ జోడీ విరుష్క ఎంతో ఆనందంగా విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా తన ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న క్రికెటర్​ శ్రేయస్‌.. నీర్‌ దోసెలు తెచ్చి తనను సంతోషపెట్టాడని విరాట్​ ఇన్​స్టోలో పోస్ట్​ చేశాడు. దీంతోపాటు 'మేం పంపించిన పుట్టగొడుగుల బిర్యానీ కూడా నచ్చిందనే అనుకుంటున్నా శ్రేయాస్'‌ అని రాసుకొచ్చాడు.

ఇదంతా చూసిన యువ బౌలర్​ చాహల్​ ఎలా ఊరుకుంటాడు. అసలే దూకుడెక్కువ. సహచర ఆటగాళ్లను కవ్వించడంలో ఎప్పుడూ ముందుంటాడు. తక్షణమే విరాట్​ను కవ్వించాడు.

chahal
చాహల్​ కామెంట్​

"భయ్యా, దయచేసి కొంత బిర్యానీ ఇక్కడకీ పంపించు. మా ఇల్లు కేవలం 1400 కిలోమీటర్ల దూరమే" అంటూ నవ్వుతున్న ఎమోజీలు కామెంట్​గా పెట్టేశాడు. ఇది చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. దండిగా కామెంట్లు పెడుతున్నారు.

ఇది చూడండి : తూకం వేసి మరీ తింటున్న కెప్టెన్ కోహ్లీ

2028 ఒలింపిక్సే​ లక్ష్యంగా వ్యూహాలకు పదును

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.