ETV Bharat / sports

'కోహ్లీ చెప్పాకే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నా'

2017లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో కెప్టెన్సీ చేయడం ప్రత్యేకమని చెప్పిన రహానె.. తన జీవితంలో ఆరోజు ఎంతో ప్రత్యేకమని తెలిపాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాల్ని పంచుకున్నాడు.

author img

By

Published : Jul 13, 2020, 1:27 PM IST

rahane
రహానె

టీమ్​ఇండియా క్రికెటర్​ అజింక్య రహానె.. టెస్టుల్లో తొలిసారిగా కెప్టెన్సీ అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. బాధ్యతలు అందుకున్న ఆ రోజు తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు. దానిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. అయితే కోహ్లీ చెప్పాకే సారథిగా బాధ్యతలు అందుకున్నట్లు వెల్లడించాడు.

"2017లో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్​లో అప్పటికే మూడు టెస్టులు ఆడాం. మొదటిది ఆసీస్​, రెండో మ్యాచ్​లో మేం గెలిచాం. మూడోది డ్రా అయింది. నాలుగో టెస్టు ఆడాల్సిన సమయానికి కోహ్లీ అనుకోకుండా గాయపడ్డాడు. కానీ ఆ మ్యాచ్​ గెలవడం మాకు ఎంతో ముఖ్యం. జట్టంతా టెన్షన్​. అప్పుడు కోహ్లీ నాకు ఫోన్ చేసి సారథిగా బాధ్యతలు చేపట్టాలని అన్నాడు. తన పరిస్థితి బాగోలేదని, ఫిట్​నెస్​ ఇబ్బంది పెడుతుందని చెప్పాడు. కోచ్​ అనిల్​ కుంబ్లే కూడా నాతో ఇదే మాట అన్నాడు. కానీ నేను మాత్రం బాధ్యతలు స్వీకరించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోయాను. అందులో నుంచి తేరుకునేలోపే కెప్టెన్​ పగ్గాలు అందుకున్నా. అందుకే ఆ రోజు నాకు ఎంతో ప్రత్యేకం"

-రహానె, టీమ్​ఇండియా క్రికెటర్

రహానె సారథ్యంలో ఆ టెస్టు ఆడిన టీమ్​ఇండియా.. ఆసీస్​పై అద్భుత విజయం సాధించింది. ఫలితంగా 2-1తో సిరీస్​ను గెల్చుకుంది.

మొత్తంగా కెరీర్​లో 65 టెస్టులు ఆడిన రహానె.. ఈ ఫార్మాట్​లో భారత్​కు ఉపసారథిగా వ్యవహరిస్తున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో మాత్రం చోటు దక్కించుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు.

ఇది చూడండి : మాజీ క్రికెటర్ కైఫ్ జీవితాన్నే మార్చేసిన ఆ మ్యాచ్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.