ETV Bharat / sports

కోహ్లీ బర్త్​డే పార్టీ: అనుష్క, ఆర్సీబీ సందడి - రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కోహ్లి పుట్టినరోజు

ఐపీఎల్​ కోసం యూఏఈలో ఉన్న కోహ్లి.. అక్కడే తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. కోహ్లీతో అనుష్క కేకు కోయించింది. ఆర్సీబీ ఆటగాళ్లు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. కోహ్లీ ముఖాన్ని మొత్తం కేకుతో నింపేశారు.

virat kohli birthday celebrations with his wife anushka sharma and rcb in uae
కోహ్లీ బర్త్​డే పార్టీ: అనుష్క శర్మ, ఆర్సీబీ హడావుడి
author img

By

Published : Nov 6, 2020, 8:04 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లి గురువారం 32వ పడిలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్​-13 కోసం యూఏఈలో ఉన్న అతను అక్కడే తన భార్య అనుష్క శర్మ, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు సభ్యుల నడుమ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. ప్రత్యేక నౌకలో జరిగిన ఈ వేడుకలో కోహ్లీతో అనుష్క కేకు కోయించింది. ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, స్పిన్నర్​ చాహల్​కు కాబోయే భార్య ధనశ్రీ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్సీబీ ఆటగాళ్లు తమ కెప్టెన్ కోహ్లీ ముఖం, జుట్టును పూర్తిగా కేకుతో నింపేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

virat kohli birthday celebrations with his wife anushka sharma and rcb in uae
కేక్​ కట్​ చేస్తున్న కోహ్లీ

ఆర్సీబీ ట్విట్టర్​లో పోస్టు చేసిన వీడియోలో.. కోహ్లీకి ఆ జట్టు ఆటగాళ్లు, కోచ్​లు, సహాయక సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం దగ్గర నుంచి.. కేకుతో నిండిపోయిన అతని మఖం వరకూ అన్ని దృశ్యాలు ఉన్నాయి. మరోవైపు క్రికెట్​ దిగ్గజం సచిన్, మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​తో సహా ప్రపంచవ్యాప్తంగా తాజా, మాజీ క్రికెటర్లు కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోపై కోహ్లీ అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. 2018లో వన్డే సిరీస్​ సందర్భంగా చివరి మ్యాచ్​లో కోహ్లీ బంతిని నమ్మశక్యంగా కానట్లు చూస్తున్న వీడియోను పోస్టు చేయడమే దానికి కారణం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.