టెస్టు క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్‌కోహ్లీ రికార్డుల జోరు కొనసాగుతోంది. పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శతకం చేసిన కోహ్లీ...మరో రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ సారథిగా అత్యధిక శతకాలు(41) సాధించాడు.
26 ఏళ్ల కోహ్లీ...మాజీ భారత క్రికెటర్ వెంగాస్కర్(6,868)ను దాటేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో 53వ స్థానంలో ఉన్నాడు విరాట్(6878*). భారత బ్యాట్స్మెన్లలో 7వ స్థానంలో ఉన్నాడు. ఇతడి కంటే ముందు సచిన్ తెందూల్కర్(15921), ద్రవిడ్(13265), గవాస్కర్(10122), లక్ష్మణ్(8781), సెహ్వాగ్(8503), గంగూలీ(7212) ఉన్నారు.
కెప్టెన్@50
ఇప్పటివరకు 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రెండో భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు విరాట్. గతంలో 2008 నుంచి 20104 వరకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 60 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ సారథి గంగూలీ(49)మూడో స్థానానికి పడిపోయాడు.
విజేతగానూ...
49 మ్యాచ్‌ల్లో 29 టెస్టు విజయాలు సాధించాడు విరాట్. ధోనీ.. 60 మ్యాచ్‌ల్లో 27 మాత్రమే గెలిచాడు. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో ఉత్తమ టెస్టు కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు కోహ్లీ. మొత్తం కెప్టెన్లలో స్టీవ్‌వా, రికీ పాంటింగ్ తర్వాత విజయశాతం కోహ్లీదే అధికం.
వేయి పరుగులు...
సఫారీలపై టెస్టుల్లో వేయి పరుగులు చేశాడు విరాట్‌కోహ్లీ. 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సాధించిన ముగ్గురు భారత ఆటగాళ్లనూ అధిగమించాడీ క్రికెటర్. ఇతడి కంటే ముందు సెహ్వాగ్(20), తెందూల్కర్(29), ద్రవిడ్(30) ఉన్నారు.
ఓవరాల్‌గా నలుగురు మాత్రమే కోహ్లీ కంటే ముందు దక్షిణాఫ్రికాపై వేయి పరుగులు చేశారు. డెన్నిస్ క్రాంప్టన్(13), నీల్ హార్వే(13), డేవిడ్ వార్నర్(18), మైకేల్ క్లార్క్(18) ఈ రికార్డు అందుకున్నారు.