టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమన్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్గా ప్రతి మ్యాచ్ గెలవాలనుకోవడం సహా ప్రతి బంతిని బౌండరీకి తరలించడానికి ప్రయత్నిస్తాడని అన్నాడు. గొప్ప ఆటాగాళ్లకు ఉన్న ముఖ్య లక్ష్యం ఇదని లీమన్ పేర్కొన్నాడు.
"కోహ్లీ ఆటతీరు అంతే. శక్తినంతా ఉపయోగించి ఆడతాడు. అందుకే ప్రతి బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నిస్తాడు. గొప్ప ఆటగాళ్లందరూ చేసేది అదే. అతడు ప్రతి మ్యాచ్ను గెలవాలని అనుకుంటాడు. కోహ్లీ సారథ్యంలో 2017లో ఆడిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ అందుకు ఉదాహరణ"
- డారెన్ లీమన్, ఆస్ట్రేలియా మాజీ కోచ్
కోహ్లీ ఉత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మన్ గ్రెగ్ చాపెల్ చెప్పాడు. ప్రపంచంలోని అత్యంత ప్రభావంత, అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ ఒకడని మెచ్చుకున్నాడు.
డిసెంబరు 17న అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్టుతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మెల్బోర్న్ (డిసెంబరు 26-30), సిడ్నీ క్రికెట్ మైదానం (జనవరి 7-11), గబ్బాలో(జనవరి 15-19) మ్యాచ్లు జరగనున్నాయి.
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, 2021 జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ కారణంతోనే విరాట్ పితృత్వ సెలవులు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్‌కు తిరిగొస్తాడు.