టీమిండియాతో ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టమని అసంతృప్తి వ్యక్తం చేశాడు పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా. కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ వేసి తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాని చెప్పాడు. త్వరలోనే భారత్‌తో ఆడే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"నా అరంగేట్రం నుంచి భారత్‌తో టెస్టు ఆడలేకపోయాననే నిజం.. నన్ను నిరాశకు గురి చేస్తోంది. ఇది దురదృష్టకరం. టీమిండియాతో ఆడాలని ఉంది. ఎందుకంటే ఆ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. ఓ లెగ్ స్పిన్నర్‌గా కోహ్లీ లాంటి టాప్ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం ఉత్సాహాన్నిస్తుంది."
-యాసిర్ షా, పాక్ స్పిన్నర్
యాసిర్ షా ఇప్పటివరకు 37 టెస్టు మ్యాచ్‌లు ఆడి 207 వికెట్లు పడగొట్టాడు. 2011లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ బౌలర్.. ఇప్పటివరకు టీమిండియాతో టెస్టు ఆడలేదు.
2012లో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్.. పరిమిత ఓవర్ల సిరీస్ మాత్రమే ఆడింది. 2008 ముంబయి ఉగ్రదాడి తర్వాత ఇప్పటివరకు పాక్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరగలేదు.
ఇవీ చూడండి.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్టార్ బౌలర్ స్టార్క్!