వచ్చే ఏడాది భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహించడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని అన్నారు పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్. దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా.. ఈ టోర్నీని యూఏఈకి బదిలీ చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్, ఐపీఎల్ 14వ సీజన్ నిర్వహణపై వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి స్పష్టత వస్తుందని వెల్లడించారు. 2022లో ఆసియా ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చేందుకు తాము హక్కులను సొంతం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ వీసాలు మంజూరు చేసేలా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఐసీసీ, బీసీసీఐని కోరారు. కాగా, భవిష్యత్తులో భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : పాక్ క్రికెటర్లకు వీసా ఇస్తారో? లేదో?