ETV Bharat / sports

అంపైర్ అలీమ్​ దార్​ ప్రపంచ రికార్డు - అలీమ్​ దార్​ మరో ప్రపంచ రికార్డు

ప్రముఖ అంపైర్ అలీమ్ దార్.. అత్యధిక వన్డేలకు అంపైరింగ్​ చేసిన వాడిగా నిలవనున్నారు. పాక్-జింబాబ్వే రెండో వన్డేతో ఈ రికార్డు నమోదు చేయనున్నారు.

Umpire Aleem Dar set to break the record for officiating most ODIs
అలీమ్​ దార్​ మరో ప్రపంచ రికార్డు
author img

By

Published : Oct 31, 2020, 10:17 PM IST

Updated : Oct 31, 2020, 11:31 PM IST

పాకిస్థాన్​కు చెందిన అంపైర్ అలీమ్ దార్, ప్రపంచరికార్డు సృష్టించనున్నారు. రావల్పిండి వేదికగా ఆదివారం జరగనున్న పాక్-జింబాబ్వే మ్యాచ్​తో అత్యధిక వన్డేలకు అంపైరింగ్​ చేసిన వ్యక్తిగా ఘనత సాధిస్తారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్ట్​జెన్​ను అధిగమిస్తారు. అలీమ్ దార్​కు ఇది 210వ వన్డే.

ఆల్​ రౌండర్​గా కెరీర్ ప్రారంభించి

పాకిస్థాన్ జట్టులో ఆల్​రౌండర్​గా 10 సంవత్సరాలు సేవలందించారు అలీమ్ దార్. 2000లో పాకిస్థాన్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్​తో మొదటిసారి అంపైర్​గా విధులు నిర్వర్తించారు. ఇప్పటివరకు 132 టెస్టులు, 46 టీ20లు, 209 వన్డేలకు ఈయన పనిచేశారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 387 మ్యాచ్​లకు అంపైరింగ్​ చేశారు.

"ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని అనుకోలేదు. ప్రతి మ్యాచ్​ను ఆస్వాదించాను, నేర్చుకున్నాను. ఈ సందర్భంగా సహకరించిన నా కుటుంబానికి, పాకిస్థాన్​ బోర్డుకు, ఐసీసీకు కృతజ్ఞతలు"

--అలీమ్​ దార్​, అంపైర్​

అలీమ్ దార్ ఈ​ ఘనత సాధించనుండటంపై ఐసీసీ సీనియర్ మేనేజర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

Last Updated : Oct 31, 2020, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.