ETV Bharat / sports

'అవకాశం ఇస్తే.. ఐపీఎల్​ నిర్వహణకు మేము రెడీ' - UAE Cricket Board Confirms Offer to BCCI about Host Indian Premier League 2020

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్​-2020పై సందిగ్ధం నెలకొన్న వేళ.. ఆసక్తికరమైన ప్రకటన చేసింది యూఏఈ. ఈ ఏడాది టోర్నీని తాము నిర్వహిస్తామని ముందుకొచ్చింది. దీనిపై బీసీసీఐ స్పందించలేదు. అక్టోబర్​లో జరగాల్సిన టీ20 వరల్డ్​కప్​ రద్దయితే ఆ స్థానంలో ఈ మెగాటోర్నీ జరిగే అవకాశముంది.

UAE Cricket Board
ఐపీఎల్​ నిర్వహించే అవకాశమిస్తే మేము రెడీ: యూఏఈ
author img

By

Published : Jun 7, 2020, 7:57 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.. ప్రపంచవ్యాప్తంగా భారీ జనాదరణ ఉన్న క్రికెట్​ లీగ్​ల్లో ఒకటి​. ఈ టోర్నీ మొదలైతే రెండు నెలలు భారత్​లో పండగ వాతావరణమే. అలాంటి ఈ క్రీడాసంబరం కరోనా వల్ల జరుగుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది. అయితే కాసుల వర్షం కురిపించే ఈ టోర్నీ నిర్వహించే ఛాన్స్​ 'మాకు ఇవ్వండి' అంటూ బహిరంగంగానే ప్రకటన చేస్తున్నాయి కొన్ని దేశాల బోర్డులు. తాజాగా ఆ జాబితాలో యూఏఈ చేరింది.

ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించేందుకు అవకాశమిస్తే.. తాము సిద్ధంగా ఉన్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) బోర్డు ప్రకటించింది. ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐకి ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలను ధ్రువీకరించింది. ఇప్పటికే ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు శ్రీలంక ఆసక్తి చూపుతోంది.

UAE cricket board confirms offer to host IPL 2020: Report
ఐపీఎల్​

" గతంలో యూఏఈ బోర్డు విజయవంతంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించింది. వివిధ దేశాల మధ్య తటస్థ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన చరిత్ర మాకుంది. ఐపీఎల్‌తో పాటు ఇంగ్లాండ్‌ సీజన్‌ మ్యాచ్‌లూ నిర్వహించేందుకు ఆయా దేశాల బోర్డులకు తెలియజేశాం. మా ప్రతిపాదన అంగీకరిస్తే సంతోషిస్తాం".

-- యూఏఈ బోర్డు

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ రద్దయితే.. అక్టోబర్‌లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. టీ20 వరల్డ్​కప్​ నిర్వహణపై ఈ నెల 10న కీలక నిర్ణయం ప్రకటించనుంది ఐసీసీ.

  • ఇవీ చూడండి:
  1. స్వదేశీ క్రికెటర్లతోనే ఐపీఎల్-2020​ జరిగితే..?
  2. విదేశాల్లో ఐపీఎల్​ నిర్వహణపై బీసీసీఐ ఆలోచన?
  3. ఐపీఎల్​పై ఆశలు.. టోర్నీకి తగ్గట్లు ఆసీస్​ బోర్డు షెడ్యూల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.