గ్లామర్ రంగాల్లో నటీనటుల అభినయం, అందానికి ప్రేక్షకులు ఫిదా అవుతారు. కానీ, మైదానంలో చెమటోడ్చే క్రికెటర్లూ హీరోలకు అందంలోనూ, శరీరాకృతిలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. అలా అందర్నీ కట్టిపడేస్తున్న కొంతమంది భారత హ్యాండ్సమ్ క్రికెటర్లు గురించి ఈ కథనం.
1) విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు రాబట్టడం నుంచి సంపాదన ఆర్జించడం వరకు అన్నింటిలోనూ తనదైన ప్రత్యేకతను చాటుతున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. మైదానంలో అదరగొట్టే బ్యాటింగ్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తోనూ యువతుల మనసు దోచేస్తున్నాడు.
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న విరాట్.. ఇటీవల తండ్రి కూడా అయ్యాడు. అలానే అత్యధిక పారితోషికం పొందిన క్రీడాకారులు జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే కావడం విశేషం.
2) కేఎల్ రాహుల్
టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. కెప్టెన్ విరాట్ కోహ్లీని దాదాపు పోలి ఉంటాడు. మైదానంలో తన స్టైలిష్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న రాహుల్.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లోని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తున్నాడు.
3) శుభ్‌మన్ గిల్
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. ఈ జాబితాలో అందరి కంటే చిన్నోడు. అండర్-19 ప్రపంచకప్ నుంచే తన బ్యాటింగ్‌తో ఎంతోమంది మనసును దోచేశాడు. 2019 ఐపీఎల్లో ఉత్తమ-ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచాడు. సచిన్ కుమార్తె సారా తెందూల్కర్‌కు శుభ్‌మన్‌పై ఇష్టం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యువతుల్లోనూ ఇతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
4) హార్దిక్ పాండ్య
ధనాధన్ షాట్లతో అదరగొట్టే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటతీరుతో ఎంతోమందిని మనసుల్ని దోచేశాడు. గతేడాది నటాషా స్టాన్కోవిచ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరికి బాబు పుట్టాడు.
5) మనీశ్ పాండే
టీమ్ఇండియాలో మరో ఆకర్షణీయమైన క్రికెటర్ మనీశ్ పాండే. మైదానంలో తన స్టైలిష్ బ్యాటింగ్‌తో యువతుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. బెంగుళూరు టైమ్స్ ఇటీవల చేసిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 14వ స్థానంలో నిలిచాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కర్ణాటకకు ఆడిన మనీశ్.. టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీకి స్నేహితుడు. వీరిద్దరూ కలిసి 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరఫున ఆడారు. పరిమిత ఓవర్ల క్రికెటర్లో భారత్‌కు ప్రాతినిధ్యం కూడా వహించాడు.
ఇవీ చూడండి: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తున్నారా? ఇవి పాటించాల్సిందే!