ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్‌కింగ్స్ అత్యంత నిలకడగా రాణిస్తున్న జట్టు. ఈ మాట చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ధోనీ నాయకత్వంలో 12 సీజన్లలో 9 సార్లు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన సీఎస్కే.. నాలుగుసార్లు రన్నరప్‌గా, మూడు సార్లు ట్రోఫీ గెలుచుకుంది. ఈ గణాంకాలు చాలు సీఎస్కే స్టామినా ఏంటో చెప్పేందుకు.
గతేడాది వేలంలో సామ్ కరన్, జోష్ హేజిల్‌వుడ్, పియూష్ చావ్లా, ఆర్.ఎస్ కిషోర్‌లను చెన్నై దక్కించుకుంది. త్వరలో జరగబోయే సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతుండగా, చెన్నై మాత్రం అనుకోని అవాంతరాల్ని ఎదుర్కొంది. ఇవి జట్టు విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మూడు ప్రధాన సమస్యలు ఏంటంటే?
1)భారత ఫాస్ట్ బౌలర్లకు బ్యాకప్ లేకపోవడం
చెన్నై సూపర్‌కింగ్స్‌లో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్(భారత్) మాత్రమే పేసర్లు. దీపక్‌కు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. కొత్త బంతితో వికెట్లు కూడా తీయగల నేర్పు ఇతడి సొంతం. చివరగా గత డిసెంబరులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తర్వాత గాయం కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. పూర్తిగా కోలుకున్న ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు.
శార్దూల్ ఠాకూర్‌కు బౌలింగ్‌లో నిలకడ లోపిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో ఒకటి లేదా రెండు వికెట్లు తీసే అవకాశం ఉంది. కానీ, శార్దూల్ ఎకానమీ రేటు అంతర్జాతీయ టీ20ల్లో 8.73, ఐపీఎల్లో 9.04 (అధికంగా) ఉంది. ఒకవేళ చాహర్ లేదా శార్దూల్ గాయాల పాలైతే, వారి స్థానాన్ని భర్తీ చేయడం సీఎస్కే యాజమాన్యానికి కష్టమవుతుంది. ఆసిఫ్, మోనూ కుమార్ లాంటి బ్యాకప్ బౌలర్లు ఉన్నా సరే వారికి అంతగా అనుభవం లేదు. దేశీయ స్థాయిలో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఈ విషయంపై సీఎస్కే దృష్టి సారించాల్సి ఉంటుంది.
2)స్పిన్నర్లపై అతిగా ఆధారపడటం
చెన్నై సూపర్‌కింగ్స్, కొన్నేళ్లుగా స్పిన్నర్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. గత కొన్ని సీజన్లను పరిశీలిస్తే స్పిన్ వారికే ప్రధానస్త్రం. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పిచ్ నెమ్మదిగా, నిదానంగా ఉండటమే ఇందుకు కారణం.
సీఎస్కేలో ఇప్పటికే హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ శాంట్నర్ రూపంలో అద్భుత స్పిన్నర్లు ఉండగా.. ఇప్పుడు పియూష్ చావ్లా, కర్ణ్ శర్మలను జట్టులోకి తీసుకున్నారు. వీరిందరిలో కేవలం ముగ్గురు స్పిన్నర్లకు మాత్రమే జట్టులో చోటు ఉంటుంది. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన వారికి స్థానం దక్కే అవకాశం ఉంది. గత సీజన్ల నుంచి స్పిన్ మాయాజాలంతో బౌలింగ్‌ను సీఎస్కే నెట్టుకొస్తున్నా.. యూఏఈ వేదికగా జరగబోయే ఐపీఎల్‌కు మాత్రం ఈ సారి కలిసి రాకపోవచ్చు.
3)సీఎస్కేలోని కీలక ఆటగాళ్లు టీ20లు ఆడి చాలాకాలం
సీఎస్కే కెప్టెన్ ధోనీ, సురేశ్ రైనా, ఇమ్రాన్ తాహిర్, షేన్ వాట్సన్ లాంటి సీనియర్లంతాఅంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పటికే రిటైరయ్యారు. వీరితో పాటు మురళీ విజయ్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, డుప్లెసిస్ టీ20లు ఆడి చాలారోజులైంది. మురళీ విజయ్ 2015లో చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. గతేడాది ఐపీఎల్లో ఇతడికి తుదిజట్టులో స్థానమే దక్కలేదు.
గతే ఐపీఎల్లో అంబటి రాయుడు 23.5, జాదవ్‌లు 18 సగటును నమోదు చేశారు. వీరిద్దరిని టీమ్ఇండియాకు ఎంపిక చేయడానికి సెలక్టర్లు సిద్ధంగా లేరు. తుదిజట్టులో స్థానం కోసం వారి ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు డుప్లెసిస్‌ను దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్స్‌న్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలాకాలమైంది. గతే సీజన్లో వాట్సన్ బ్యాటింగ్ సగటు 23.41 ఉండగా.. రైనా 23.94 సగటు ఉంది. ఇలాంటి సమస్యలు ఎన్నో మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
దీనితో పాటే జట్టులోని ఇద్దరకు క్రికెటర్లతో పాటు 12 మంది సహాయ సిబ్బందికి కరోనా సోకినట్లు ఇటీవలే తేలింది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. వీరందరూ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి కోలుకుని, నెగటివ్ వస్తే సరి. లేదంటే ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి.