ETV Bharat / sports

జాతివివక్ష వ్యాఖ్యలపై ఆసీస్​ మాజీల ఆగ్రహం - సిడ్నీ టెస్టులో జాతివివక్ష

జాతి వివక్ష వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీలు మైక్ హస్సీ, షేన్ వార్న్ తీవ్రంగా స్పందించారు. క్రికెటర్లపై అనుచితంగా ప్రవర్తించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను ఏమాత్రం ఉపేక్షించరాదని తెలిపారు.

'Terrible behaviour': Hussey, Warne slam SCG crowd racial abuse
జాతివివక్ష అంశంపై ఆసీస్​ మాజీల ఆగ్రహం
author img

By

Published : Jan 10, 2021, 1:35 PM IST

టీమ్​ఇండియా ఆటగాళ్లపై జాతివివక్ష వ్యాఖ్యలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మైక్ హస్సీ, షేన్​ వార్న్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు జరగడం బాధాకరమని తెలిపారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు సందర్భంగా పలువురు అల్లరి మూకలు భారత క్రికెటర్లపై జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదు చేసింది భారత జట్టు. ఫలితంగా నాలుగో రోజు రెండో సెషన్​లో కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది.

'Terrible behaviour': Hussey, Warne slam SCG crowd racial abuse
అంపైర్​కు ఫిర్యాదు చేస్తున్న సిరాజ్

"ఇదొక దారుణమైన ప్రవర్తన. ఈ కాలంలోనూ ఇలాంటివి జరగడం నమ్మశక్యంగా లేదు. వివక్షపూరిత వ్యాఖ్యలు చేసినవారిని మైదానాలకు రాకుండా జీవితకాలం నిషేధించాలి. గొప్ప క్రికెట్ ఆడి, మనల్ని ఆనందింపజేయడానికి వచ్చింది టీమ్​ఇండియా. అందుకు మనం కృతజ్ఞత చూపాలి. క్రికెటర్లను అవమానించడం ఆమోదయోగ్యం కాదు."

-మైక్ హస్సీ

హస్సీతో పాటే ఆసీస్​ మాజీ బౌలర్ షేన్ వార్న్.. ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశాడు.

టీమ్​ఇండియా నిరసనతో తాత్కాలికంగా నిలిచిపోయిన ఆట

"నిజానికి ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇలాంటిది జరగాల్సింది కాదు. అదీ కూడా ఘోరంగా గడిచిన 12నెలల తర్వాత ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరం. దోషులపై కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నా"

- షేన్ వార్న్

సిడ్నీలో ఆసీస్​తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో టీమ్​ఇండియా బౌలర్లు బుమ్రా, మహ్మద్​ సిరాజ్​ జాతి వివక్షకు గురయ్యారు. ఈ మేరకు విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత జట్టు ఫిర్యాదు చేసింది. నాలుగో రోజు కూడా.. ఇదే తరహా ఘటన పునరావృతమైంది. దీంతో భారత్​కు బేషరతుగా క్షమాపణ చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా.

ఇదీ చూడండి: భారత్​కు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.