దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.. రేపు(శుక్రవారం) తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోకూడదని అనుకున్నాడు. కరోనా కట్టడి కోసం పోరాడుతున్న సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా ఇప్పటికే రూ.50 లక్షలు విరాళం ప్రకటించాడు మాస్టర్.
'సచిన్ బర్త్డే చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదు. తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కట్టడి కోసం పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, డిఫెన్స్ వారికి మాస్టర్ మద్దతుగా నిలవాలని మాస్టర్ అనుకుంటున్నారు' అని అతడి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు.
అయితే సచిన్ పుట్టినరోజున అతడి 40 అరుదైన ఫొటోలు విడుదల చేసేందుకు ఓ అభిమాన సంఘం సిద్ధమవుతుండగా, ఇన్నేళ్లలో మాస్టర్ చేసిన సహాయ కార్యక్రమాల్ని హైలెట్ చేసేందుకు మరో ఫ్యాన్ క్లబ్ రెడీ అవుతోంది.