ETV Bharat / sports

సచిన్​, లారా మళ్లీ బ్యాట్​ పట్టేస్తున్నారోచ్​​

దిగ్గజ క్రికెటర్లు సచిన్​ తెందుల్కర్​, లారా మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​లో వీరు తమ బ్యాటింగ్​తో ఆకట్టుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి 21 వరకు భారత్​ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

sachin
సచిన్​
author img

By

Published : Feb 9, 2021, 6:00 PM IST

కరోనా కారణంగా.. గతేడాది 4 మ్యాచ్​ల అనంతరం ఆగిపోయిన 'అన్​అకాడమీ రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​' తిరిగి మొదలుకానుంది. భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​, వెస్టిండీస్ దిగ్గజం​ బ్రియాన్​ లారా మళ్లీ ఈ టోర్నీతో మైదానంలో సందడి చేయనున్నారు. మార్చి 2నుంచి 21 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని 65వేల సీట్ల సామర్థ్యం ఉన్న షాహీద్​ వీర్​ నారాయణ్​​ సింగ్ అంతర్జాతీయ క్రికెట్​ స్డేడియం వేదిక కానుంది. ఇందులో సచిన్​, లారాతో పాటు వీరేంద్ర సెహ్వాగ్​(భారత్​), ముత్తయ్య మురళీధరన్, తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక), బ్రెట్​ లీ(ఆస్ట్రేలియా)‌ సహా పలు దిగ్గజ ఆటగాళ్లు ​​ పాల్గొననున్నారు.

టోర్నీ ఉద్దేశం ఏమిటంటే?

ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాలు పాలుపంచుకుంటాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు మైదానంలో ఆడతారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశం. ఈ రోడ్​ సేఫ్టీ సిరీస్​ ఫౌండర్​ రవి గైక్వాడ్​. సచిన్​ తెందుల్కర్​ బ్రాండ్​ అంబాసిడర్​.

కరోనా వల్ల నాలుగు మ్యాచ్​ల అనంతరం గతేడాది మార్చి 11న ఈ టోర్నీ రద్దయింది.

ఇదీచూడండి: కరోనా ఎఫెక్ట్​తో లెజెండ్స్ టోర్నీ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.