ETV Bharat / sports

'అథ్లెట్లు ఇంట్లోనే ఉండటం మంచిది కాదు' - 'అథ్లెట్లు ఇంట్లోనే ఉండటం మంచిది కాదు'

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశం మొత్తం లాక్​డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇలాంటి పరిస్థితులు తన కెరీర్ ఆరంభంలో వస్తే చాలా కష్టమయ్యేదని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.

యువరాజ్
యువరాజ్
author img

By

Published : Apr 20, 2020, 7:05 PM IST

కెరీర్‌ ఆరంభంలో లాక్‌డౌన్‌ పరిస్థితులు ఉంటే తనకు చాలా కష్టమయ్యేదని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన అతడు తాజాగా ఓ ఛానెల్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. లాక్‌డౌన్‌ వేళ క్రీడాకారులు చాలా రోజులు ఇంట్లోనే కూర్చోవడం మంచిది కాదని చెప్పాడు. ఆటగాళ్లకు ఇలాంటి సమయం రాదని, ఈ లాక్‌డౌన్‌తో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం దక్కిందని చెప్పాడు.

"మనమంతా చాలా లక్కీ. మీకూ, నాకూ 3 లేదా 4 గదులున్నాయి. బయట ఎంతో మంది పెద్ద కుటుంబంతో ఒకే గదిలో ఉంటున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతుంటారు. కానీ, అందరూ మే 3 వరకు ఓపిక పట్టాల్సిందే. ప్రస్తుతం నేనున్న ప్రదేశానికి అలవాటు పడ్డా. ఎందుకంటే క్రికెట్‌ ఆడే రోజుల్లో చాలా క్యాంపులకు వెళుతుండేవాడిని కాబట్టి ఇప్పుడది అలవాటైంది."

-యువరాజ్ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

"ఈ లాక్‌డౌన్‌కు ముందు క్రీడాకారులు ఇంటివద్ద ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడంతా సన్నిహితులతో ఉంటున్నారు. అయితే, అథ్లెట్లు చాలా రోజులు ఇంటి పట్టునే ఉండడం అంత మంచిది కాదు" అని యువీ అన్నాడు. అలాగే తన కెరీర్‌ తొలినాళ్లల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తనకు ఇబ్బందిగా ఉండేదని మాజీ బ్యాట్స్‌మన్‌ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.