ETV Bharat / sports

'ముందే పరుగెత్తితే.. పరుగే ఇవ్వకూడదు'

author img

By

Published : Jul 29, 2020, 8:28 AM IST

టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ మరోసారి మన్కడింగ్​ నిబంధనలపై స్పందించాడు. ఇటువంటి సందర్భాల్లో సాంకేతిక సాయంతో తప్పును గుర్తించాలని అభిప్రాయపడిన ఈ సీనియర్​ బౌలర్​.. పరుగులు కూడా ఇవ్వకుండా చూడాలని ట్విట్టర్​ వేదికగా తెలిపాడు.

team india bowler ashwin about mankading rule in cricket
అశ్విన్​

గతేడాది ఐపీఎల్​లో ఇంగ్లాండ్​ ఆటగాడు జోస్​ బట్లర్​ను మన్కడింగ్​ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​. మన్కడింగ్​ నిబంధనల ప్రకారం అతను చేసింది సరైనదే అయినప్పటికీ.. దాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తారు. అయితే తాజాగా మరోసారి అశ్విన్​ ఈ అంశంపై ట్విట్టర్​ వేదికగా స్పందించాడు.

"ఇలాంటి సందర్భాల్లో సాంకేతికత సాయంతో బ్యాట్స్​మన్​ తప్పును గుర్తించి.. అలా చేసిన ప్రతిసారి పరుగులు ఇవ్వకుండా చూస్తారని ఆశిస్తున్నా. చాలామంది ఈ విషయంలో పక్షపాత వైఖరిని గుర్తించలేకపోతున్నారు. నేను బంతిని వేయకముందే రెండు అడుగులు ముందుకు వేయడం వల్ల నాన్​ స్ట్రైకర్​ అదనంగా రెండో పరుగు తీయగలిగితే.. మళ్లీ ముందున్న బ్యాట్స్​మనే బంతిని ఎదుర్కొంటాడు. ప్రధాన బ్యాట్స్​మన్​ ఇలా అదనపు ప్రయోజనం పొందడం వల్ల.. మ్యాచ్​లో చాలా తేడా జరగొచ్చు. అసలే బౌలర్లకు కష్టకాలం నడుస్తున్న ఈ తరుణంలో బంతికి, బ్యాటుకు మధ్య సమతూకం తేవాల్సిన అవసరం ఉంది" అని అశ్విన్​ స్పష్టం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.