కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే.. క్రికెట్లోనూ పలు మార్పులు తీసుకొచ్చింది. అయితే వైరస్ ప్రభావం ముగిసిన తర్వాత, బంతిని సలైవా(ఉమ్మి), చెమటతో రుద్దకూడదని వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై స్పందించాడు భారత యువ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్. ఎర్ర బంతి మెరుపు కోసం ఆ రెండూ అవసరమని, తెల్లబంతి అవి అక్కర్లేదని అన్నాడు.
"పరిమిత ఓవర్ల క్రికెట్లో బంతి మెరుపు అనే మాట రాదు. వన్డేల్లో 25 ఓవర్లకు ఓ బాల్ ఉపయోగిస్తుండటం వల్ల అలాంటి ఇబ్బంది తలెత్తకపోవచ్చు" -జయదేవ్ ఉనద్కత్, భారత క్రికెటర్
టీమిండియా తరఫున 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్.. ఐపీఎల్ గత సీజన్లో ఎక్కువ ధర పలికిన దేశీయ క్రికెటర్‌గా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కరోనా ప్రభావం తీవ్రమవుతుండటం వల్ల ఈ లీగ్‌ను నిరవధిక వాయిదా వేశారు.