ETV Bharat / sports

ఐపీఎల్​లో ఇతడి పవర్​ప్లే స్పెషలిస్ట్ ఎవరంటే? - సురేశ్ రైనా బ్రాడ్ హాగ్

ఐపీఎల్​ పవర్​ప్లేలో తన అభిమాన బ్యాట్స్​మెన్ ఎవరో చెప్పాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. రైనా, బట్లర్, వార్నర్​లు తనకిష్టమైన ఆటగాళ్లని అన్నాడు.

హాగ్
హాగ్
author img

By

Published : Mar 29, 2020, 10:19 AM IST

కరోనా మహమ్మారి ప్రభావంతో ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడింది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ.. వచ్చే నెల​ 15న మొదలవుతుంది. దేశంలో 21 రోజులు లాక్​డౌన్ ప్రకటించడం వల్ల ఆ తేదీకీ ప్రారంభమయ్యేది సందేహమే. అయితే ఈ లీగ్​లోని పవర్​ ప్లే ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్.

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా, సన్​రైజర్స్​ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ జాస్ బట్లర్​లు పవర్​ ప్లేలో టాప్-3 క్రికటెర్లని అన్నాడు. ఆ సమయంలో వీరు ఎలాంటి బౌలర్​నైనా సమర్థమంతంగా ఎదుర్కోగలరని చెప్పాడు.

అయితే గేల్, ధావన్, కోహ్లీ లాంటి బ్యాట్స్​మెన్ పేర్లు లేకుండా వీరి గురించి చెప్పడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.