ETV Bharat / sports

కరోనాపై పోరుకు సన్​రైజర్స్ 10 కోట్ల విరాళం

author img

By

Published : Apr 9, 2020, 5:01 PM IST

కరోనా నియంత్రణ చర్యలకు మద్దతుగా తమవంతు సాయం ప్రకటించింది ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్​రైజర్స్ హైదరాబాద్​. వైరస్ కట్టడి చర్యల కోసం 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

ఐపీఎల్
ఐపీఎల్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఈ పోరుకు మద్దతు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, క్రీడా సంస్థలు తమ వంతు సాయం చేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్​రైజర్స్ హైదరాబాద్ కూడా దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

"సన్ టీవీ గ్రూప్ (సన్​రైజర్స్ హైదరాబాద్) కరోనా నియంత్రణ చర్యలకు మద్దతు తెలుపుతుంది. ఉపశమన చర్యల్లో భాగంగా 10 కోట్ల సాయం ప్రకటిస్తున్నాం."

-సన్​రైజర్స్ ట్వీట్

గత వారం బీసీసీఐ పీఎం కేర్స్​కు 51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. క్రికెటర్లు సచిన్, రైనా, కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు కూడా తమ వంతు సాయం చేశారు.

  • Sun TV Group (SunRisers Hyderabad) is donating Rs.10 Crores towards Corona Covid-19 relief measures. #COVID19 #CoronaUpdate

    — SunRisers Hyderabad (@SunRisers) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.