దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్‌పై భారత మాజీ వికెట్‌కీపర్ కిరణ్ మోరే.. ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీసులోని అతడి ప్రదర్శన.. మైదానంలో ఆటకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గావస్కర్‌తో తనుకున్న గత స్మృతులను పంచుకున్నాడు.
"నెట్ ప్రాక్టీస్‌లో నేను చూసిన చెత్త ఆటగాళ్లలో గావస్కర్ ఒకడు(నవ్వుతూ). అతడికి ప్రాక్టీస్ అంటే అసలు ఇష్టముండేది కాదు. రేపు మ్యాచ్ ఉందనగా ఈ రోజు నెట్లో ప్రదర్శన, టెస్టులో గావస్కర్ బ్యాటింగ్.. మీరు ఊహించినదానికి 99.9 శాతం పూర్తి భిన్నంగా ఉంటుంది. అప్పటివరకు అతని గురించి ఎలాంటి అంచనాలు లేని మీరు ఆహా అని అంటారు"
కిరణ్ మోరే, టీమ్ఇండియా మాజీ వికెట్‌కీపర్
బ్యాటింగ్‌లో గావస్కర్ విజృంభించడానికి కారణం అతడికి ఉన్న అద్భుతమైన ఏకాగ్రతే అని కిరణ్ వెల్లడించాడు. దేశీవాళీ మ్యాచ్‌లో ఓసారి 50 కంటే తక్కువ పరుగులు చేసిన గావస్కర్.. బాధపడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.
"సునీల్ ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నేను భారత్ జట్టులోకి వచ్చినప్పుడు వెస్ట్ జోస్కోసం దేశీయ క్రికెట్లో ఆడాం. వాంఖడేలో ఓ టెస్టు మ్యాచ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అందులో సునీల్ దాదాపు 50 పరుగులకు దగ్గరగా వచ్చి ఔటయ్యాడు. అతను అలాగే డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాడు. చుట్టూ ఎవరూ లేరు. గ్లౌస్లు విసిరేసి చాలా బాధపడ్డాడు. గావస్కర్ ఒకవేళ డకౌట్ అయినా బాగుండేవాడేమో. కానీ గంటవరకు మైదానంలో బ్యాటింగ్ చేసి బయటకు రావడం అతన్ని చాలా బాధపెట్టింది"
కిరణ్ మోరే, టీమ్ఇండియా మాజీ వికెట్‌కీపర్
టెస్టుల్లో 10వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గావస్కర్. 125 మ్యాచ్‌లు ఆడి, 34 సెంచరీలు సహా 10,122 పరుగులు సాధించిన ఘనత ఇతడి సొంతం. ఎప్పటికప్పుడు గొప్ప ఓపెనింగ్స్ చేస్తూ.. ఆల్‌టైమ్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన వారిలో గావస్కర్ ఒకడు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కార్టెన్తో పాటు, భయంకరమైన బౌలింగ్ సామర్థ్యం ఉన్న జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ లాంటి బౌలర్లను ఎదుర్కొని బ్యాటింగ్‌తో సత్తా చాటాడు.
ఇదీ చూడండి:'కోహ్లీ బైక్ ఎక్కి వచ్చేయ్.. ఇద్దరం చేద్దాం'