క్రికెట్ ప్రపంచంలో టీమ్ఇండియా ఖ్యాతిని పెంచేందుకు తన వంతు కృషి చేసిన మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ పుట్టిన రోజు నేడు. 1949 జులై 10న జన్మించిన గావస్కర్.. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా భారత క్రికెట్ జట్టుకు అపూర్వ సేవలందించాడు. 34 సెంచరీలతో అత్యధిక టెస్టు శతకాలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 125 టెస్టుల్లో 10వేల పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడు సన్నీ. తర్వాత ఈ రికార్డును సచిన్ తెందుల్కర్ అధిగమించాడు. 1983 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా విజయంలో కీలకంగా నిలిచాడు గావస్కర్. శుక్రవారం 71వ పడిలోకి అడుగుపెట్టాడు.
సన్నీకి ఆ రెండు సీట్లు..
భారత దిగ్గజ క్రికెట్ ఆటగాడు సునీల్ గావస్కర్‌కు వాంఖడే స్టేడియంలో రెండు శాశ్వత సీట్లను తిరిగి కేటాయించాలని ముంబయి క్రికెట్ సంఘం నిర్ణయించింది. క్రికెట్‌కు సన్నీ వీడ్కోలు చెప్పినప్పుడు ఎంసీఏ గర్వారె పెవిలియన్‌లోని రెండు సీట్లను గావస్కర్ దంపతులకు కేటాయించింది. అయితే 2011 వన్డే ప్రపంచకప్ ముందు స్టేడియం నవీకరణ పనుల్లో భాగంగా సీటింగ్‌లో మార్పులు చేర్పులు జరగడంతో ఆ సీట్లు కనిపించకుండాపోయాయి.
ఆ రెండు సీట్లను తిరిగి ఏర్పాటు చేయాలని ముంబయి క్రికెట్ సంఘం నిర్ణయించింది. శుక్రవారం సునీల్ గావస్కర్ బర్త్‌డేకు ఒక రోజు ముందు ఈ విషయాన్ని చెప్పింది. ప్రెసిడెంట్స్ బాక్స్‌లో ఆ సీట్లను ఏర్పాటు చేయనుంది.
ఇదీ చూడండి:'లాక్డౌన్లో విశ్రాంతి లభించినా.. ఆటతీరులో మార్పు వస్తుంది'