ETV Bharat / sports

'ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!'

author img

By

Published : Feb 21, 2021, 5:09 PM IST

Updated : Feb 21, 2021, 6:20 PM IST

తమ జట్టులో పిచ్​ను విమర్శించే ఆలోచనే లేదని ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అన్నాడు. భారత్​తో జరిగిన రెండో టెస్టులో పిచ్​ స్వభావంపై మాట్లాడాడు. ఏ జట్టుకైనా స్వదేశంలో క్రికెట్‌ జరిగితే అనుకూల పిచ్‌లు సిద్ధం చేసుకునే హక్కు ఉంటుందని చెప్పాడు.

stuart broad feels india are well in utilising their rights in preparing friendly pitches
అనుకూల పిచ్‌లపై స్టువర్ట్‌బ్రాడ్‌

భారత్‌తో జరిగిన రెండో టెస్టులో పిచ్‌ అనూహ్యంగా తిరగడంపై ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ స్పందించాడు. అందులో తప్పుపట్టాల్సిన విషయమేం లేదన్నాడు. తమ జట్టులో పిచ్‌ను విమర్శించే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. ఏ జట్టుకైనా స్వదేశంలో క్రికెట్‌ జరిగితే అనుకూల పిచ్‌లు సిద్ధం చేసుకునే హక్కు ఉంటుందని చెప్పాడు. కాబట్టి, భారత్‌ హోమ్‌ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటుందని తెలిపాడు. కాగా, రెండో టెస్టులో కోహ్లీసేన తమకంటే మంచి ప్రదర్శన చేసిందని, పిచ్‌ను సద్వినియోగం చేసుకొని రాణించిందని బ్రాడ్‌ ఓ అంతర్జాతీయ పత్రికకు వెల్లడించాడు.

ఇక 2018లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులోనూ తాము ఇలాగే చేశామని బ్రాడ్‌ గుర్తుచేసుకున్నాడు. స్వింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమైందని, దాంతో తమ జట్టు ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిందని ఇంగ్లాండ్‌ పేసర్‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ఏ జట్టును తీసుకున్నా వారి సొంత దేశాల్లో ఇలాగే చేస్తారని బ్రాడ్‌ పేర్కొన్నాడు. అది హోమ్‌ అడ్వాంటేజ్‌ అని పేర్కొన్నాడు. కాగా, తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో భారీ తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. ఇక ఈనెల 24 నుంచి మొతేరా మైదానంలో ఇరు జట్లూ మూడో మ్యాచ్‌ ఆడనున్నాయి. ఇది డే/నైట్‌ టెస్టు కావడంతో మరింత ఆసక్తి పెరిగింది.

ఇదీ చదవండి:'ఈ రెండు టెస్టులూ భారత్​కు అత్యంత కీలకం'

Last Updated : Feb 21, 2021, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.