బాల్ ట్యాంపరింగ్ విషయం ఆస్ట్రేలియా జట్టులో అందరికీ తెలిసినప్పటికీ, స్మిత్ ఒక్కడే ఆ నిందను తనపై వేసుకున్నాడని ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఆరోపించాడు. సభ్యులందరినీ ఈ ఉదంతం నుంచి తప్పించేందుకే కెప్టెన్ ఇలా చేశాడని పేర్కొన్నాడు. 2018లో జరిగిన ఈ వివాదం.. క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. కేప్‌టౌన్‌లో సఫారీలతో టెస్టు సందర్భంగా సాండ్‌పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ ఘటనలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌తోపాటు డేవిడ్ వార్నర్ సంవత్సరం పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం గురించి చెప్పాడు ఫ్లింటాఫ్.
"ఆసీస్ జట్టు సభ్యులెవరికీ బాల్ ట్యాంపరింగ్ విషయం తెలియదంటే నేను నమ్మలేను. ఎవరైనా నాకు ఒక ట్యాంపరింగ్ చేసిన బాల్ ఇస్తే ఓ బౌలర్‌గా నాకు ఆ విషయం ప్రాథమికంగా తెలుస్తుంది. ట్యాంపరింగ్ ఉదంతాలు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి. బాల్‌కు సన్‌క్రీమ్ రాసి ఇలాంటి తప్పిదాలకు పాల్పడ్డారు. చేయగలిగిన ప్రతిదాన్ని ప్రయత్నించారు. బంతిపై స్వీట్ పూసి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్లు మా జట్టుపై సైతం ఆరోపణలు వచ్చాయి. సాండ్‌పేపర్‌తో ట్యాంపరింగ్‌కు పాల్పడటం తప్పు. పిచ్చిపని కూడా. ఆస్ట్రేలియా జట్టు సభ్యులందరూ ఏదో ఓ రకంగా ఈ ఉదంతంలో పాలుపంచుకోలేదంటే నేను నమ్మలేను"
- ఫ్లింటాఫ్, ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్
ఇదీ చూడండి : పన్నెండేళ్లకే చెస్‌కు అంకితమా: విషీ