శ్రీలంక క్రికెట్ జట్టులోని దాదాపు 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు వెనకడుగు వేశారు. ఈ నిర్ణయం వెనుక భారత్ హస్తం ఉందన్న పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు లంక క్రీడాశాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో. భద్రత కారణాల దృష్ట్యా క్రికెటర్లు సందిగ్ధంలో ఉన్నారని ట్వీట్ చేశారు.
"శ్రీలంక క్రికెటర్లను భారత్ ప్రభావితం చేసిందన్న ఆరోపణల్లో నిజం లేదు. 2009లో జరిగిన బాంబు దాడి వల్లే జట్టులోని కొంత మంది ఆటగాళ్లు పాక్ వెళ్లేందుకు నిరాకరించారు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ఎవరైతే పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారో వారినే ఎంపిక చేశాం. మా జట్టు బలంగా ఉంది. పాక్‌ను వారి దేశంలోనే ఓడిస్తాం".
-- హరిన్ ఫెర్నాండో, శ్రీలంక క్రీడాశాఖ మంత్రి
-
No truth to reports that India influenced Sri Lankan players not to play in Pakistan.Some decided not to play purely based on 2009 incident. Respecting their decision we picked players who were willing to travel. We have a full strength team & we hope to beat Pakistan in Pakistan
— Harin Fernando (@fernandoharin) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">No truth to reports that India influenced Sri Lankan players not to play in Pakistan.Some decided not to play purely based on 2009 incident. Respecting their decision we picked players who were willing to travel. We have a full strength team & we hope to beat Pakistan in Pakistan
— Harin Fernando (@fernandoharin) September 10, 2019No truth to reports that India influenced Sri Lankan players not to play in Pakistan.Some decided not to play purely based on 2009 incident. Respecting their decision we picked players who were willing to travel. We have a full strength team & we hope to beat Pakistan in Pakistan
— Harin Fernando (@fernandoharin) September 10, 2019
పాక్‌లో ఆడేందుకు 10 మంది శ్రీలంక ఆటగాళ్లు అభ్యంతరం చెప్పగా.. ఇందుకు కారణం భారత్ అని విమర్శించారు పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి. తమ దేశంలో లంక ఆటగాళ్లు ఆడితే ఐపీఎల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని చెబుతూ ట్వీట్ చేశారు.
పాకిస్థాన్‌లో పర్యటించేందుకు సిద్ధమైన టీ-20 కెప్టెన్ మలింగ, మాజీ సారథి మ్యాథ్యూస్‌తో కలిపి పది మంది ఆటగాళ్లు.. పాక్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ-20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి.
ఇదీ చదవండి...