ETV Bharat / sports

'2011 వన్డే ప్రపంచకప్​ను శ్రీలంక అమ్మేసింది'

2011 వన్డే ప్రపంచకప్​ ఫైనల్​లో ఫిక్సింగ్ జరిగిందని, లంక జట్టు భారత్​కు కప్పు అమ్మేసిందని ఆ దేశ మాజీ క్రీడామంత్రి మహిందానంద ఆరోపణలు చేశారు.

'2011 వన్డే ప్రపంచకప్​ను శ్రీలంక అమ్మేసింది'
టీమ్​ఇండియా
author img

By

Published : Jun 18, 2020, 5:34 PM IST

Updated : Jun 18, 2020, 5:45 PM IST

2011 వన్డే ప్రపంచకప్​ ఫైనల్లో ఫిక్సింగ్ జరిగిందని.. శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిందానంద అలుతగమగే ఆరోపించారు. ఆ మ్యాచ్​లో భారత్​కు శ్రీలంక కప్పు అమ్మేసిందనే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ ఛానెల్​తో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నారు. 2011 ప్రపంచకప్​ ఫైనల్లో తమ జట్టు గెలవాల్సి ఉన్నా, కావాలనే ఓడిపోయిందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

sri lanka Former Sports Minister
శ్రీలంక మాజీ క్రీడామంత్రి మహిందానంద

అదే మ్యాచ్​కు కామెంటరీ చేసిన​ రణతుంగ.. గతంలో మాట్లాడుతూ, ఇప్పటికీ తనకు ఆ ఫైనల్​పై సందేహాలున్నాయని తెలిపాడు. ఆరోజు ఏం జరిగిందో దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు పేర్కన్నాడు. లేకపోతే తానే ఆ విషయాల్ని వెల్లడిస్తానని అన్నాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన లంక.. 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ వికెట్లు త్వరత్వరగా కోల్పోయిన సరే గంభీర్-ధోనీ జోడీ.. కప్పు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించింది. దీంతో 28 ఏళ్ల తర్వాత టీమ్​ఇండియా ఈ మెగాటోర్నీలో విజేతగా నిలిచింది.

శ్రీలంక క్రికెటర్లు తరచుగా ఫిక్సింగ్ ఆరోపణలతో దొరికిపోతున్నారు. 2018 ఇంగ్లాండ్​తో టెస్టు సందర్భంగా మ్యాచ్​ ఫిక్సింగ్ చేస్తూ కొందరు ఆటగాళ్లు దొరికిపోగా, గత నెలలో ముగ్గురు క్రికెటర్లు అవినీతి అంశంలో ఐసీసీ విచారణను ఎదుర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 18, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.