శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా టెస్టుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో అంటిగ్వాలో జరిగిన తొలి టెస్టులో ఈ మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయకుండా ఈ ఘనత అందుకోవడం విశేషం.
![Niroshan Dickwella creates record in Tests](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11163238_dickwella1.jpg)
ఇంతకీ ఆ రికార్డు ఏంటి?
గురువారంతో ముగిసిన శ్రీలంక-వెస్టిండీస్ టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసిన డిక్వెల్లా మూడంకెల స్కోరు అందుకోకుండానే ఔటయ్యాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 17 అర్ధశతకాలు చేసిన ఇతడు.. ఒక్క సెంచరీ అయినా చేయకుండా ఎక్కువసార్లు 50 పరుగులకు మించి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత క్రికెటర్ చేతన్ చౌహాన్‌ను(16) అధిగమించాడు.
ఇది చదవండి: రెండో వన్డే పోరుకు భారత్-ఇంగ్లాండ్ సై