కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధిక వాయిదా పడటం వల్ల అసహనం వ్యక్తం చేశాడు టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్. ఫలితంగా ఐపీఎల్లో ఆటగాళ్లు తమ ప్రదర్శనను నిరూపించుకునేందుకు అవకాశం పోయిందని తెలిపాడు. చాలా మంది ఆటగాళ్లు ఈ ఐపీఎల్లో సత్తా చాటి ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌కు బెర్త్ సంపాదిద్దామనుకుంటున్నారు. కానీ ఇప్పుడీ అవకాశం చేజారిపోయింది.
"ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ సంపాదించడానికి ఐపీఎల్ ఓ మంచి అవకాశం. ఈ టోర్నీ ఓ ఆటగాడి కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. కానీ వాయిదా పడటం వల్ల ఈ అవకాశం చేజారిపోయింది. "
-విజయ్‌శంకర్, టీమిండియా క్రికెటర్.
2019 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు విజయ్ వన్డేలో నాలుగో బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు. కానీ ఆ స్థానంలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. అనంతరం మెల్లమెల్లగా అవకాశాలన్నీ తగ్గిపోయాయి. ఆ తర్వాత విజయ్ కాలికి గాయమవడం వల్ల ఆ ఏడాది వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. కనుక ఈ సారి జరగబోయే ఐపీఎల్లో తన సత్తా చాటి ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో చోటు సంపాదించాలని భావించాడు.
ఇదీ చూడండి : ఐపీఎల్ నిరవధిక వాయిదా.. సీజన్ నిర్వహణ సందేహమే