ETV Bharat / sports

వన్డే సిరీస్​ కోసం భారత్​ చేరుకున్న సఫారీలు - ind vs sa

మూడు వన్డేల సిరీస్​లో పాల్గొనేందుకు సఫారీ జట్టు భారత్ చేరుకుంది. ధర్మశాల వేదికగా ఈ గురువారం తొలి మ్యాచ్​ జరగనుంది.

south-team-arrived-in-inidia-for-3-match-odi-series
వన్డే సిరీస్​ కోసం భారత్​ చేరుకున్న సఫారీలు
author img

By

Published : Mar 9, 2020, 12:00 PM IST

భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది దక్షిణాఫ్రికా. ఈనెల 12న ప్రారంభం కానున్న ఈ సిరీస్​లో పాల్గొనేందుకు 16మందితో కూడిన సఫారీ జట్టు.. తాజాగా దిల్లీ​ చేరుకుంది. ధర్మశాల వేదికగా జరగబోయే తొలివన్డే కోసం ఇరుజట్లు.. రేపు(మంగళవారం) అక్కడికి వెళ్లనున్నాయి.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్య పరీక్షల అనంతరం ఫిట్​నెస్​ను పరీక్షించుకోనున్నారు టీమిండియా క్రికెటర్లు.

ఈ సిరీస్​లో భాగంగా రెండో వన్డే ఈనెల 15న లఖ్​నవూలో, మూడో వన్డే 18న కోల్​కతాలో జరగనుంది.

ఇటీవలే కివీస్​ పర్యటనలో టీ20 సిరీస్​ గెల్చుకుని.. టెస్టు, వన్డే సిరీస్​ల్లో వైట్​వాష్​కు గురైంది టీమిండియా. అయితే సఫారీలతో జరిగే మ్యాచ్​ల్లో తిరిగి ఫామ్​లోకి రావాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్​ను 3-0 తేడాతో కైవసం చేసుకుని జోరుమీదున్న దక్షిణాఫ్రికా.. అదే ఉత్సాహాన్ని ఇక్కడా కొనసాగించాలని చూస్తోంది.

జట్ల వివరాలు

టీమిండియా

శిఖర్​ ధావన్​, పృథ్వీ షా, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), కేఎల్​ రాహుల్​, మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​, రిషభ్​ పంత్​, హార్దిక్​ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్​ కుమార్​, చాహల్​, జస్ప్రీత్​ బుమ్రా, నవదీప్​ సైనీ, కుల్దీప్​ యాదవ్​, శుభ్​మన్​ గిల్​

దక్షిణాఫ్రికా

క్వింటన్ డికాక్ (కెప్టెన్), బవుమా, వాన్ డర్ డసేన్, డుప్లెసిస్, కైల్ వెర్రీన్నే, హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్, జాన్ స్మట్స్, ఫెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరాన్ హెండ్రిక్స్, ఎన్రిచ్ నోర్ట్​జే, జియోర్జే లిండే, కేశవ్ మహారాజ్.

ఇదీ చూడండి: బుల్లి పఠాన్​తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్​​ బాక్సింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.