ETV Bharat / sports

శ్రీలంక క్రికెటర్​పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడుతున్న లంక జట్టులోని ఓ యువ క్రికెటర్​పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి. దీనిపై నివేదిక సమర్పించాలని శ్రీలంక జట్టు మేనేజర్ అశాంత డిమెల్​ను ఆ దేశ క్రికెట్​ బోర్డు ఆదేశించింది.

SLC instructs Sri Lankan team manager to submit report on alleged misconduct by player
శ్రీలంక క్రికెటర్​పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు
author img

By

Published : Jan 22, 2021, 10:20 AM IST

శ్రీలంక క్రికెట్లో కలకలం రేగింది. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో ఆడుతున్న లంక జట్టులోని ఓ యువ ఆటగాడి లైంగిక దుష్ప్రవర్తనపై నివేదిక సమర్పించాలని టీమ్​ మేనేజర్​ అశాంత డిమెల్​ను శ్రీలంక క్రికెట్​ (ఎస్​ఎల్​సీ) ఆదేశించింది. స్పిన్​ బౌలింగ్​ ఆల్​రౌండరైన ఆ యువ ఆటగాడు.. తమ జట్టు సహాయక సిబ్బందిలోని ఓ మహిళతో హోటల్​ గదిలో పట్టుబడ్డట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఆటగాడి ప్రవర్తనపై మీడియాలో దుమారం చెలరేగింది.

"ప్రధాన మీడియా వెలుగులోకి తెచ్చిన ఈ సంఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిజ నిర్ధారణ నివేదికను సమర్పించాల్సిందిగా జట్టు మేనేజర్​ అశాంతను ఆదేశించాం".

- శ్రీలంక క్రికెట్ బోర్డు

అయితే మీడియా కథనాల్ని కోచ్​ మికీ ఆర్థర్​ కొట్టిపారేశాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా బయోబబుల్​లో ఉన్నారని.. అనుచితంగా ప్రవర్తించడానికి అవకాశమే లేదని తెలిపాడు.

ఇదీ చూడండి: 'అమ్మో.. టీమ్ఇండియాతో ఆచితూచి ఆడాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.