ETV Bharat / sports

మాలిక్ రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్​గా

author img

By

Published : Oct 11, 2020, 5:44 PM IST

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్​లో 10 వేల పరుగులు సాధించిన తొలి ఆసియా క్రికెటర్​గా రికార్డులకెక్కాడు.

Shoaib Malik Becomes First Asian Cricketer to Score 10,000 T20 Runs
మాలిక్ రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్​గా

పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో పదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. పాక్​ నేషనల్‌ టీ20 కప్‌లో భాగంగా కైబర్‌ పఖ్తుంఖ్వా జట్టు తరఫున ఆడుతున్న మాలిక్‌.. బెలుచిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 77 పరుగులు సాధించాడీ బ్యాట్స్​మన్.

టీ20ల్లో పదివేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో క్రికెటర్​గా నిలిచాడు మాలిక్. క్రిస్ గేల్ (13,296), పొలార్డ్ (10,370) పరుగులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే మాలిక్ తర్వాత టీ20ల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆసియా ఆటగాడిగా టీమ్​ఇండియా సారథి కోహ్లీ (9,123) కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.