అవకాశమొస్తే టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. దూకుడైన, వేగవంతమైన పేసర్లను తాను తయారచేయగలలని అన్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
భారత్ బౌలింగ్ విభాగంతో పనిచేసే అవకాశమొస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు స్పందించిన అక్తర్.. "కచ్చితంగా పనిచేస్తాను. నా జ్ఞానాన్ని, ఆలోచనల్ని యువ ఆటగాళ్లతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. దూకుడు కలిగిన వేగవంతమైన పేసర్లను తయారు చేస్తా. ఛాన్స్ వస్తే ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బౌలింగ్ కోచింగ్ ఇస్తాను" -షోయబ్ అక్తర్, పాక్ మాజీ పేసర్
అలానే దిగ్గజ సచిన్, తనకు మంచి స్నేహితుడని చెప్పిన అక్తర్.. తనకు అప్పట్లోనే భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని అన్నాడు.