ETV Bharat / sports

ప్రాక్టీసులో గబ్బర్.. బౌండరీలు బాదేస్తూ బిజీ - దిల్లీ క్యాపిటల్స్ వార్తలు

నాలుగు నెలల తర్వాత ప్రాక్టీసులో దిగిన ధావన్.. బంతులను బౌండరీలకు తరలిస్తూ బిజీగా కనిపించాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ప్రాక్టీసులో గబ్బర్.. బౌండరీలు బాదేస్తూ బిజీ
శిఖర్ ధావన్
author img

By

Published : Aug 1, 2020, 5:41 AM IST

టీమ్​ఇండియా ఓపెనర్ శిఖర్​ ధావన్.. దాదాపు నాలుగు నెలల తర్వాత మైదానంలో దిగాడు. దాదాపు నాలుగు గంటలపాటు ప్రాక్టీసు చేశాడు. ఆ వీడియోను ట్వీట్ చేశాడు. ఇందులో బంతులను ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ కనిపించాడు. జోరు కొనసాగిస్తున్నాను. బంతిని బాదే శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాననే వ్యాఖ్య జోడించాడు.

సెప్టెంబరు 19 నుంచి మొదలవనున్న ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున ఆడనున్నాడు ధావన్. యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి తమ జట్టులోని భారత క్రికెటర్లు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది దిల్లీ యాజమాన్యం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.