వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(4), కే.ఎల్ రాహుల్(6) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. విండీస్ బౌలర్ షెల్డాన్ కాట్రెల్ వీరిద్దరిని ఔట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు.
ఒకే ఓవర్లో ఇద్దరిని ఔట్ చేశాడు కాట్రెల్. ఏడో ఓవర్ రెండో బంతిని రాహుల్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడగా.. మిడ్ వికెట్ దగ్గరా హెట్మయిర్ అందుకున్నాడు. అనంతరం ఆ ఓవర్ చివరి బంతికి విరాట్ బౌల్డయ్యాడు.
అనంతరం రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ టీమిండియా ఇన్నింగ్స్‌ను పరుగుపెట్టించారు. వీరిద్దరూ 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అల్జారీ జోసెఫ్.. హిట్ మ్యాన్‌ను ఔట్ చేసి దెబ్బతీశాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్, పంత్ ఉన్నారు.
ఇదీ చదవండి: ధోనీ టీ20ల్లోనే ఆడతాడా.. వన్డేల మాటేమిటి?