ETV Bharat / sports

'ఛైర్మన్​గా శశాంక్ తప్పుకోవడం అందరికి సంతోషమే'

ఐసీసీ ఛైర్మన్​గా శశాంక్ మనోహర్​ వైదొలగడం మంచి ఆలోచన అని బీసీసీఐ మాజీ ఛైర్మన్​ ఎన్​.శ్రీనివాసన్​ అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్​ను అతడు తీవ్రంగా దెబ్బతీశాడని ఆరోపించారు.

Shashank Manohar 'anti-Indian', reduced India's importance in world cricket: Ex-BCCI Chairman N Srinivasan
'మరోసారి బాధ్యతల్ని కాదని శశాంక్ పారిపోతున్నాడు'
author img

By

Published : Jul 2, 2020, 2:13 PM IST

Updated : Jul 2, 2020, 4:18 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఛైర్మన్​ పదవి నుంచి శశాంక్​ మనోహర్​ వైదొలగడం మంచి ఆలోచన అని భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్​.శ్రీనివాసన్​ తెలిపారు. రెండేళ్లు ఆ పదవిలో కొనసాగిన శశాంక్​ బుధవారం వైదొలిగినట్లు ఐసీసీ ప్రకటించింది. డిప్యూటీ ఛైర్మన్​ ఇమ్రాన్​ ఖ్వాజా తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాడని బోర్డు స్పష్టం చేసింది. దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్​.శ్రీనివాసన్​ స్పందించారు.

"భారత క్రికెట్​కు అతడు (శశాంక్ మనోహర్) ఎంత నష్టం చేశాడో నాకు తెలుసు. ఇప్పుడు తాను ఆ పదవి నుంచి వైదొలగడం వల్ల ప్రతి వ్యక్తి ఎంతో సంతోషంగా ఉంటారు. ఆటలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఐసీసీలో మన దేశ వ్యవస్థను దెబ్బతీశాడు. అతడు భారత వ్యతిరేకిగా.. ప్రపంచ క్రికెట్​లో దేశ ప్రాముఖ్యాన్ని తగ్గించాడు. ఇప్పుడు అతడు పారిపోతున్నాడు. ఎందుకంటే ప్రస్తుత భారత నాయకత్వం నుంచి ఎలాంటి సహకారం లభించదని అతడికి అర్థమైంది".

- ఎన్​.శ్రీనివాసన్​, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు

2015లో బీసీసీఐ సంక్షోభంలో ఉన్నప్పుడు పారిపోయి.. మళ్లీ కరోనా పరిస్థితుల్లో శశాంక్​ మరోసారి అదే తరహాలో ఐసీసీ అధ్యక్ష పదవి వదిలి వెళ్లిపోతున్నాడని శ్రీనివాసన్ ఆరోపించారు.

Last Updated : Jul 2, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.